News April 27, 2024
OTTలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. ఎప్పుడంటే?

మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT విడుదల తేదీని డిస్నీ+హాట్‌స్టార్ ప్రకటించింది. మే 5 నుంచి తమ ప్లాట్‌ఫామ్‌లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ చిత్రం తెలుగులోనూ పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టింది. దీనికి చిదంబరం దర్శకత్వం వహించారు. మే 3న ఈ మూవీ OTTలోకి రానుందని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు తేదీ మారినట్లు తెలుస్తోంది.
Similar News
News April 20, 2026
చరిత్ర సృష్టించిన పంజాబ్

IPLలో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఒక సీజన్లో ఆడిన తొలి 6 మ్యాచుల్లో ఒక్క ఓటమి ఎరుగని ఫస్ట్ టీమ్‌గా నిలిచింది. KKRతో మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా మొత్తం 11 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆర్సీబీ (8 పాయింట్లు), రాజస్థాన్ (8 పాయింట్లు), సన్‌రైజర్స్ (6 పాయింట్లు) ఉన్నాయి. ఇక ఇప్పటివరకు కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్ 2 పాయింట్లతో లాస్ట్ ప్లేస్‌లో ఉంది.
News April 20, 2026
హార్ముజ్‌లో భద్రత ఫ్రీగా రాదు: ఇరాన్

USతో మళ్లీ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ ఇంధన భద్రత ఉచితంగా రాదని, కొంత మూల్యం చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఓవైపు ఇరాన్ ఆయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ మరోవైపు ఇతరులకు మాత్రం హార్ముజ్‌లో ఫ్రీగా భద్రత కావాలనుకోవడం కుదరదని ఆ దేశ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేశారు. ఇరాన్ దాని మిత్రపక్షాలపై ఉన్న ఒత్తిడికి ముగింపు పలికితేనే చమురు ధరలు స్థిరంగా ఉంటాయన్నారు.
News April 20, 2026
వైజాగ్ టు సింగపూర్.. ఇంటర్నేషనల్ క్రూయిజ్‌కు ఏర్పాట్లు

AP: గతంలో విశాఖ-చెన్నై మధ్య క్రూయిజ్ షిప్ సేవలు ప్రారంభమవగా తొలిసారి ఇంటర్నేషనల్ యాత్రకు రంగం సిద్ధమైంది. కార్డిలియో నౌక జులై 15న వైజాగ్ నుంచి సర్వీసును ఆరంభించనుంది. చెన్నై మీదుగా థాయిలాండ్‌లోని ఫుకెట్, మలేషియాలోని లంకావి, కౌలాలంపూర్, చివరగా సింగపూర్‌కు షిప్ చేరుకొని తిరిగి రానుంది. మొత్తం 14 రోజులపాటు విలాసవంతమైన నౌకా విహారం ఉండనుంది. టికెట్ రేట్లపై త్వరలో క్లారిటీ రానుంది.


