News December 27, 2024

తెలంగాణ వాసుల కోరిక నెరవేర్చిన మన్మోహన్

image

తెలంగాణ ప్రజల ఎన్నో దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నెరవేర్చింది మన్మోహనే. నాడు ప్రధానిగా ఉన్న ఆయన ఎంతో రాజనీతితో వ్యవహరించారు. విభజనకు అనుకూల, అననుకూల నేతలతో ఎన్నో చర్చలు చేశారు. సామరస్యంగా విభజన చేయడానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్ర విభజన ఆవశ్యకతను గుర్తిస్తూనే ఆ తర్వాత వచ్చే సమస్యలను ప్రస్తావించారు. విభజిత APకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తొలుత చెప్పింది ఈయనే. అయితే తర్వాత NDA పట్టించుకోలేదు.

Similar News

News January 24, 2025

కీలక స్థాయి వద్దకు BITCOIN

image

క్రిప్టో కరెన్సీ మార్కెట్ గత 24 గంటల్లో మోస్తరుగా పుంజుకుంది. మొత్తం మార్కెట్ విలువ $3.55Tకి చేరుకుంది. బిట్‌కాయిన్ నేడు $750 నష్టంతో $1,03,179 వద్ద కొనసాగుతోంది. దీనికిది కీలక స్థాయి. నిన్న $1,06,850 నుంచి $1,01,262 మధ్య చలించింది. అంటే $6000 మేర ఊగిసలాడింది. డామినెన్స్ 57.7%గా ఉంది. 1.73% లాభపడిన ఎథీరియం $3,290 వద్ద ట్రేడవుతోంది. XRP 2.42, SOL 0.41, DOGE 2.68, BNB 1.50, AVAX 3.77% ఎరుపెక్కాయి.

News January 24, 2025

BREAKING: టికెట్లు విడుదల

image

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్‌ను అందుబాటులో ఉంచనుంది.

News January 24, 2025

హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి విడాకులు?

image

సోషల్ మీడియాలో భాగస్వామి ఫొటోలను డిలీట్ చేయడం సెలబ్రిటీల విడాకులకు హింట్‌గా నెటిజన్లు భావిస్తున్నారు. తాజాగా హీరోయిన్ ‘కలర్స్’ స్వాతి ఆ విధంగానే వార్తల్లో నిలిచారు. ఆమె తన భర్త వికాస్ వాసుతో దిగిన ఫొటోలను SM నుంచి తొలగించారు. దీంతో భర్తతో స్వాతి విడాకులు తీసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ ప్రమోషన్స్ సమయంలోనూ ఇలాంటి రూమర్సే రాగా స్పందించేందుకు స్వాతి నిరాకరించారు.