News July 28, 2024

చరిత్ర సృష్టించిన మనూ భాకర్

image

ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మనూ హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువతి. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్‌లో పాల్గొనేవారు. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్‌లో 9 బంగారు పతకాలు కొల్లగొట్టారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించారు. అర్జున అవార్డు గ్రహీత కూడా.

Similar News

News January 19, 2026

పోలాండ్ మంత్రికి ముఖం మీదే ఇచ్చిపడేసిన జైశంకర్!

image

పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్‌స్కీతో భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదంపై పోలాండ్ జీరో టాలరెన్స్ ప్రదర్శించాలని, భారత్ పొరుగు దేశాల్లో (పరోక్షంగా పాక్‌లో) ఉగ్రవాదానికి సపోర్ట్ చేయొద్దని గట్టిగా చెప్పారు. గత ఏడాది పాక్ పర్యటనకు వెళ్లిన సికోర్‌స్కీ కశ్మీర్‌పై పాక్ వాదానికి మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జైశంకర్ నేరుగా చురకలంటించారు.

News January 19, 2026

భార్యాభర్తలకు ఒకే ITR.. బడ్జెట్‌లో ప్రకటన?

image

బడ్జెట్ 2026లో మ్యారీడ్ కపుల్ కోసం ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్ విధానాన్ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం భార్యాభర్తలను ఒకే ఆర్థిక యూనిట్‌గా పరిగణించి ఉమ్మడి ఆదాయంపై పన్ను లెక్కిస్తారు. ఈ విధానం వస్తే దంపతుల ఉమ్మడి పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకే ITR ఫైల్ చేయొచ్చు. ఇది ముఖ్యంగా మధ్యతరగతి, సింగిల్ ఇన్‌కమ్ కుటుంబాలకు భారీ ఊరటనిస్తుంది.

News January 19, 2026

6 గంటలకుపైగా విజయ్‌ను విచారించిన సీబీఐ

image

కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ దళపతిని సీబీఐ రెండోసారి విచారించింది. సుమారు 6 గంటలకు పైగా అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈ నెల 12న విజయ్ మొదటిసారి అధికారుల ముందు హాజరయ్యారు. అప్పుడు దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. అయితే ఆరోజు ఆయనను సాక్షిగా ప్రశ్నించగా, ఇవాళ అనుమానితుడిగా ఇంటరాగేషన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసులో సీబీఐ తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తిగా మారింది.