News July 28, 2024
చరిత్ర సృష్టించిన మనూ భాకర్

ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. మనూ హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువతి. ఆమె తండ్రి మెరైన్ ఇంజినీర్, తల్లి ప్రిన్సిపల్. చిన్నప్పటి నుంచే అథ్లెటిక్స్‌లో పాల్గొనేవారు. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్‌లో 9 బంగారు పతకాలు కొల్లగొట్టారు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో 16 ఏళ్ల వయసులోనే గోల్డ్ మెడల్ సాధించారు. అర్జున అవార్డు గ్రహీత కూడా.
Similar News
News November 19, 2025
ముగిసిన కోట మైసమ్మ ఆలయ జాతర

నిడమనూరు మండల పరిధిలోని కోట మైసమ్మ ఆలయ జాతర మంగళవారం ముగిసింది. మూడో రోజు సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. అంతకముందు భక్తులు బోనాలు సమర్పించారు. జిల్లా నుంచే కాకుండా మహబూబ్‌నగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చినట్లు ఈవో సిరికొండ నవీన్ కుమార్ తెలిపారు.
News November 19, 2025
ఇమ్యూనిటీని పెంచే ఫ్రూట్స్ ఇవే..

చలికాలంలో ఇమ్యూనిటీ తగ్గిపోయి త్వరగా రోగాల బారిన పడుతుంటారు. దీనికి చెక్ పెట్టాలంటే కొన్ని ఫ్రూట్స్ డైట్‌లో యాడ్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. నారింజ, యాపిల్, దానిమ్మ, కివీ తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. వీటితో పాటు శరీరానికి తగినంత విటమిన్-డీ లభించేలా చూసుకోవాలి. అలాగే ఈ కాలంలో వేడినీరు, జావలు, సూప్‌లు తీసుకోవడం కూడా మంచిదని సూచిస్తున్నారు.
News November 19, 2025
HYD: మరో 50 ప్రాంతాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

నగరంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో GHMC ఇప్పటికే ఏర్పాటు చేసిన 150 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను సమర్థంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్తగా మరో 50 ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు నోడల్ ఏజెన్సీ అయిన టీజీరెడ్కో జీహెచ్ఎంసీతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది.


