News May 4, 2024
ఓటమికి అనేక కారణాలు: హార్దిక్ పాండ్య
కోల్‌కతాతో తమ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య తెలిపారు. ‘టీ20ల్లో భాగస్వామ్యాలు నిర్మించడం ముఖ్యం. మేము వరుస వికెట్లు కోల్పోయి ఆ పని చేయలేకపోయాం. తొలి ఇన్నింగ్స్ తర్వాత తేమ కారణంగా పిచ్ కాస్త మెరుగైంది. కానీ అనుకున్న ఫలితం రాబట్టలేకపోయాం. ఈ మ్యాచ్‌లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. నేను సవాళ్లను ఇష్టపడతా. వాటి నుంచే మనం మరింత మెరుగుపడతాం’ అని హార్దిక్ తెలిపారు.
Similar News
News November 5, 2024
అంబానీ వెడ్డింగ్‌లో 120రకాల టీలు పెట్టిన మాస్టర్
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ఎన్నో విషయాల్లో స్పెషాలిటీ చాటుకుంది. అందులో సర్వ్ చేసిన టీ కూడా చాలా ప్రత్యేకం. ఎందుకంటే కుంకుమపువ్వు టీ, పాన్ ఫ్లేవర్ టీతో పాపులరైన మధ్యప్రదేశ్‌కు చెందిన లక్ష్మణ్ ఓజా ఈ శుభకార్యంలో టీ మాస్టర్. ఒకట్రెండు కాదు ఏకంగా 120 రకాల టీలను అతిథులకు అందించారు. దాదాపు 15ఏళ్లుగా ఆయన టీ తయారు చేస్తున్నారు. అంబానీ ఇంట దక్కిన అవకాశంతో తన ఇన్నేళ్ల కృషి ఫలించినట్లైందని అన్నారు.
News November 5, 2024
వారికి జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
AP: దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనం పెంచుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రూ.50 వేల ఆదాయం దాటిన ఆలయాల్లో పనిచేసేవారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. పూజారులకు రూ.15వేల జీతం ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. మొత్తంగా 3,203 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
News November 5, 2024
జగన్.. ఐదేళ్లలో నువ్వేం చేశావ్?: మంత్రి అనిత
AP: ఇప్పుడు లా&ఆర్డర్ గురించి మాట్లాడుతున్న జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఏం చేశారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు వైసీపీ పాపాలే కారణమన్నారు. పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. వాస్తవాలను కాకుండా జగన్ సైకో బ్యాచ్ సోషల్ మీడియాలో తమపై బురదజల్లుతూ, జనాలను భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు.