News December 9, 2024
నేడు తెలంగాణ బంద్‌కు మావోయిస్టుల పిలుపు
TG: ములుగు జిల్లా చల్పాక <<14757563>>ఎన్‌కౌంటర్<<>>కు నిరసనగా మావోయిస్టులు నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. ఆహారంలో విష ప్రయోగం చేసి కాల్చి చంపారని వారు ఆరోపించారు. మావోల బంద్ పిలుపు నేపథ్యంలో ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విద్యాలయాలు, వ్యాపార సంస్థలు బంద్‌ను పాటించాలని మావోయిస్టులు కోరుతూ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 19, 2025
కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధాని ట్విస్ట్
కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ట్విస్ట్ ఇచ్చారు. విడుదల చేసే బందీల పేర్ల జాబితాను వెల్లడించే వరకు ఈ ఒప్పందంలో తాము ముందుకు సాగలేమని చెప్పారు. తాము ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడట్లేదని పేర్కొన్నారు. ఏం జరిగినా హమాసే బాధ్యత వహించాలని తెలిపారు. అవసరమైతే అమెరికా అండతో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే హక్కు తమకు ఉందని హెచ్చరించారు.
News January 19, 2025
నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం
AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించగా 6.82 లక్షల మంది భక్తులకు టీటీడీ టోకెన్లను జారీ చేసింది. మరోవైపు రేపు దర్శనం చేసుకునే వారికి ఎలాంటి టోకెన్లు ఇవ్వబోమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. సర్వదర్శనానికి సంబంధించి నేరుగా క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలిపింది. ప్రోటోకాల్ మినహా వీఐపీ దర్శనాలను రద్దు చేసింది.
News January 19, 2025
మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడంటే?
TG: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఇది జరుగుతుందని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవడంలో వెనుకబడ్డామని హైకమాండ్ మందలించినట్లు చెప్పారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి కేటాయింపులు చేస్తామని పేర్కొన్నారు.