News May 3, 2024
మావోయిస్టుల కోటకు బీటలు!
మావోయిస్టులకు పెట్టని కోటగా మారిన ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం క్రమంగా భద్రతా బలగాల అధీనంలోకి వస్తోంది. గత 4 నెలల్లో ఈ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి భారీ నష్టం వాటిల్లింది. వివిధ ఎన్‌కౌంటర్లలో 91 మంది నక్సలైట్లు మరణించగా.. 205 మంది అరెస్ట్ అయ్యారు. మరో 231 మంది లొంగిపోయారు. దీంతో మావోయిస్టు కేంద్ర కమిటీ సురక్షిత స్థావరాల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 11, 2024
ప్లీజ్.. నన్నలా పిలవద్దు: కమల్ హాసన్
తనను ‘ఉలగనాయగన్’ వంటి స్టార్ టైటిల్స్‌తో పిలవొద్దని సినీపరిశ్రమ, మీడియా, అభిమానులకు కమల్ హాసన్ విజ్ఞప్తి చేశారు. ఆర్ట్ కంటే ఆర్టిస్ట్ గొప్ప కాదనే విషయాన్ని తాను నమ్ముతానని, తానెప్పుడూ గ్రౌండెడ్‌గా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. తనలోని లోపాలను సరిదిద్దుకుంటూ మరింత మెరుగవడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కమల్ హాసన్/కమల్/KH అని మాత్రమే పిలవాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
News November 11, 2024
కేసుల నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీకి కేటీఆర్: మంత్రి పొన్నం
TG: తనపై వస్తున్న ఆరోపణలు, కేసుల నుంచి తప్పించుకోవడానికే <<14582636>>కేటీఆర్ ఢిల్లీ<<>> వెళ్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బాధ్యతగల ప్రజాప్రతినిధిగా ఫార్ములా-ఈ రేసు కేసులో పోలీసుల విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు సూచించారు. కేటీఆర్‌పై వచ్చిన అభియోగాలపై విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరామని చెప్పారు.
News November 11, 2024
విమాన వేంకటేశ్వరుడి గురించి తెలుసా?
తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకునేవారు ఈ విషయాన్ని తెలుసుకోండి. ఆనంద నిలయం విమాన గోపురంపై వాయవ్య మూలన గూడు లాంటి చిన్న మందిరం ఉంటుంది. వెండి మకరతోరణంతో ఉన్న ఆ మందిరంలో శ్రీవారి మూలమూర్తిని పోలిన విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహ దర్శనం మూలమూర్తి దర్శనంతో సమానమని ప్రతీతి. క్యూలో, రద్దీ కారణంగా ఆనంద నిలయంలోని స్వామి వారి దర్శనం కాకపోతే ఈ విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా యాత్రా ఫలం దక్కుతుందని నమ్మకం.