News August 13, 2024
శరద్ పవార్‌కు మరాఠా కోటా సెగ
అసెంబ్లీ ఎన్నికలను మరాఠా రిజర్వేషన్ల అంశం ఈసారి షేక్ చేయబోతున్నట్టే ఉంది. మహారాష్ట్రలోనే సీనియర్ పొలిటీషియన్, NCPSP చీఫ్ శరద్ పవర్‌కు తాజాగా ఈ సెగ తగిలింది. షోలాపూర్ జిల్లాలో ప్రసంగిస్తుండగా పోరాటదారులు ఆయనకు అడ్డుతగిలారు. నినాదాలు చేస్తూ జెండాలు చూపించారు. గతంలో పెద్దగా పట్టించుకోని ఆయన ఇప్పుడు వారికి మద్దతివ్వక తప్పలేదు. కొన్నేళ్లుగా ఈ అంశాన్ని పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి.
Similar News
News September 10, 2024
LPGతో వంట ఖర్చు 5 రూపాయలే: కేంద్ర మంత్రి
పీఎం ఉజ్వల స్కీమ్‌లో ప్రతిరోజూ వంటకయ్యే ఖర్చు రూ.5 అని పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పురి అన్నారు. ఆ స్కీమ్‌లో లేనివాళ్లకు రూ.12 అవుతుందన్నారు. ‘గతంలో గ్రామాల్లో స్వచ్ఛ వంట ఇంధనం పరిమితంగా లభించేది. 2014లో 14 కోట్లున్న LPG కనెక్షన్లు 2024కు 33 కోట్లకు పెరిగాయి. సిలిండర్ ధరలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటాయి. నన్నడిగితే వారి హయాంలో అసలు సిలిండర్లే లేవంటాను’ అని పేర్కొన్నారు.
News September 10, 2024
లక్ష మందిని చంపటమే జగన్ లక్ష్యం: లోకేశ్
AP: ప్రకాశం బ్యారేజీ కూల్చి లక్ష మందికిపైగా ప్రజలను చంపటమే జగన్ లక్ష్యమని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపి, 5 ఊర్ల నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చేసి, విజయవాడతో పాటు లంక గ్రామాలను నామ రూపాలు లేకుండా చేయాలని పన్నిన కుట్ర బట్టబయలైంది’ అని ట్వీట్ చేశారు.
News September 10, 2024
Be Careful: నెయిల్ పాలిష్‌లో విష పదార్థాలు!
మహిళలు ఇష్టంగా వేసుకొనే నెయిల్ పాలిష్‌లో విష పదార్థాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వాటితో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
*టొలూనీ: నరాలకు నష్టం, మెదడు పనితీరు మందగింపు, శ్వాస సమస్యలు, జుట్టు రాలడం, వికారం
*డైబ్యుటైల్ ఫటాలేట్, TPHP: అంతస్రావి గ్రంథులకు హానికరం, హార్మోన్ల అసమతుల్యత, గర్భధారణ సమస్యలు
*ఫార్మాల్డిహైడ్: క్యాన్సర్ కారకం, చర్మం, కళ్లు, శ్వాస వ్యవస్థకు హానికరం, అలర్జీ కారకం