News March 2, 2025

మార్చి 02: చరిత్రలో ఈ రోజు

image

1935: ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జననం
1936: దిగ్గజ రంగస్థల నటుడు అబ్బూరి గోపాలకృష్ణ జననం
1938: తొలితరం నాటకకర్త వడ్డాది సుబ్బారాయుడు మరణం
1949: కవయిత్రి సరోజినీ నాయుడు మరణం
1956: ఫ్రాన్స్ నుంచి మొరాకో దేశానికి స్వాతంత్ర్యం
1963: మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ జననం
1977: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్‌ జననం
1990: ఉమ్మడి ఏపీ తొలి ముస్లిం మహిళా మంత్రి మసూమా బేగం మరణం

Similar News

News March 25, 2025

39మంది ఎంపీలతో పీఎంను కలుస్తాం: స్టాలిన్

image

డీలిమిటేషన్ విషయంలో తమ రాష్ట్రానికి చెందిన 39మంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీని మీట్ అవుతామని తమిళనాడు సీఎం స్టాలిన్ తెలిపారు. ‘ఇటీవల ముగిసిన అఖిలపక్ష సమావేశంలో చేసిన తీర్మానాల ఆధారంగా తయారుచేసిన నివేదికను రాష్ట్రం నుంచి ఉన్న ఎంపీలందరితో కలిసి ప్రధానికి అందిస్తాం. తమిళనాడు పోరాటాన్ని ఆపదు. కచ్చితంగా ఈ పోరులో విజయం సాధిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.

News March 25, 2025

లీటర్ పెట్రోల్‌పై రూ.17 తగ్గించాలి: షర్మిల

image

పెట్రోల్, డీజిల్ ధరలపై ఏపీ సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు లీటరుపై రూ.17 తగ్గించాలని APCC చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ‘రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ రూ.109.60, డీజిల్ రూ.97.47గా ఉంది. TN, TGతో పోల్చినా APలో ధరలు ఎక్కువ. పెట్రోల్, డీజిల్ మీద పన్నుల తగ్గింపుపై TDP, YCP నీచ రాజకీయాలు చేస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు CBN రూ.17 తగ్గించవచ్చని చెప్పారు. ఇప్పుడు వారి హామీని నిలబెట్టుకోవాలి’ అని కోరారు.

News March 25, 2025

ఏటీఎం ఛార్జీల పెరుగుదల.. ఎప్పటినుంచంటే..

image

ఈ ఏడాది మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు పెరగనుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో 5సార్లు, నాన్ మెట్రో ప్రాంతాల్లో 3సార్లు ప్రతి నెలా ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. మే 1 నుంచి ఆ పరిధి దాటితే డబ్బు విత్‌డ్రాకు ఇప్పుడున్న రూ.17 నుంచి రూ.19కి, బాలెన్స్ చెకింగ్‌కు ఇప్పుడున్న రూ.6 నుంచి రూ.7కి ఛార్జీలు పెరగనున్నాయి.

error: Content is protected !!