News November 14, 2024

అమెరికా విదేశాంగ మంత్రిగా మార్కో రూబియో

image

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మంత్రివర్గాన్ని, కీలక పదవుల్ని వేగంగా భర్తీ చేస్తున్నారు. భారత సంతతి మహిళ తులసీ గబ్బార్డ్‌ను జాతీయ నిఘా విభాగానికి డైరెక్టర్‌గా, ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోను విదేశాంగ మంత్రిగా నామినేట్ చేశారు. చైనాపై రూబియో తరచూ ఘాటు విమర్శలు చేస్తుంటారు. మరోవైపు రక్షణ విభాగం నుంచి తొలగించాల్సిన అధికారుల పేర్లతో ఓ జాబితాను ట్రంప్ రెడీ చేస్తున్నట్లు సమాచారం.

Similar News

News July 10, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹220 పెరిగి ₹98,400కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹90,200 పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 10, 2025

రెండు రోజులు వైన్స్ బంద్

image

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ఈనెల 13, 14 తేదీల్లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, నార్త్ హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలకు ఈ నిబంధన వర్తిస్తుందని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 10, 2025

లంచ్ బ్రేక్ సమయానికి ENG స్కోర్ ఎంతంటే?

image

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి ENG 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలే, డకెట్‌లను నితీశ్ కుమార్ పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో పోప్(12*), రూట్(24*) ఉన్నారు. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ తొలి వికెట్ కోసం వేట కొనసాగిస్తున్నారు.