News August 20, 2024
నా మాటలు గుర్తుపెట్టుకో చీప్ మినిస్టర్ రేవంత్: KTR

TG: సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేయలేరని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు KTR కౌంటర్ ఇచ్చారు. ‘నా మాటలు గుర్తుపెట్టుకో చీప్ మినిస్టర్ రేవంత్. మేం అధికారంలోకి వచ్చిన రోజునే అంబేడ్కర్ సచివాలయ పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని తొలగిస్తాం. మీ లాంటి ఢిల్లీ గులాములు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడతారని మేం అనుకోవట్లేదు. మీ మానసిక ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 5, 2025
జిల్లాకు ‘ప్రకాశం’ అని నామకరణం చేసింది ఈ రోజే!

ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనంతరం ఒంగోలు జిల్లా కాస్త ప్రకాశం జిల్లాగా మారింది నేడే. 1970లో జిల్లా ఏర్పడగా, 1972 డిసెంబర్ 5న స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి CM టంగుటూరి ప్రకాశం పంతులు పేరున జిల్లాకు నామకరణం చేశారు. నాగులుప్పలపాడు(M) వినోదరాయునిపాలెంలో జన్మించిన ప్రకాశం పంతులు స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ మహనీయుడి పేరున ఏర్పడ్డ జిల్లా వాసులుగా గర్విద్దాం.. ఆయన సేవలను కొనియాడుదాం!
News December 5, 2025
నటుడు క్యారీ-హిరోయుకి తగావా కన్నుమూత

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా(75) కన్నుమూశారు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో ఆయన చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు.
News December 5, 2025
స్క్రబ్ టైఫస్ వ్యాధిని ఈ లక్షణాలతో గుర్తించండి

AP: స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే చిగ్గర్ పురుగు మనిషిని కుట్టినచోట నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. తర్వాత తీవ్రమైన జ్వరం, చలి, ఒళ్లు నొప్పులు ఉంటాయి. తలనొప్పి, అలసట, వాంతులు, విరేచనాలు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపి రోగి క్రమంగా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధి కాదని వైద్యులు తెలిపారు.


