News October 31, 2024

‘అమరావతి’ డిజైన్లలో మార్పుల్లేవ్: నారాయణ

image

AP: రాజధాని అమరావతి నిర్మాణ పనులకు డిసెంబర్ 31లోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. పాత టెండర్ల కాలపరిమితి ముగిసినందున న్యాయపరమైన చిక్కులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పులు లేవని, గతంలో ఉన్నవే కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.

Similar News

News November 17, 2024

మా ప్రభుత్వంపై కుట్రలు : దామోదర

image

TG: గత 10 ఏళ్లలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని మంత్రి దామోదర రాజనర్సింహ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ‘రూ.50వేల కోట్ల అప్పు తీర్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది. 10 నెలలు కాకుండానే మా ప్రభుత్వంపై కొందరు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని రూపుమాపేలా కాంగ్రెస్ శ్రేణులు సంఘటితం కావాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.

News November 17, 2024

మణిపుర్‌లో బీజేపీకి NPP మద్దతు ఉపసంహరణ

image

అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపుర్ రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. అక్కడ బీజేపీ ఆధ్వర్యంలోని బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది. 60 స్థానాలున్న మణిపుర్‌లో బీజేపీకి 32, NPPకి 7 సీట్లు ఉన్నాయి. మొత్తంగా NDAలోని పార్టీలకు 53 స్థానాలు ఉండగా, NPP సపోర్ట్ ఉపసంహరించుకోవడంతో బలం 46 స్థానాలకు పడిపోతుంది. ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదు.

News November 17, 2024

పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా జావేద్.. గిలెస్పీ ఔట్?

image

పాకిస్థాన్ హెడ్ కోచ్ జాసన్ గిలెస్పీకి పీసీబీ ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. నూతన కోచ్‌గా పాక్ మాజీ క్రికెటర్ అకీబ్ జావేద్‌ను నియమిస్తారని సమాచారం. అన్ని ఫార్మాట్లకు ఆయనే హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తారని తెలుస్తోంది. రేపు దీనిపై పీసీబీ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా పీసీబీ ఇటీవలే గిలెస్పీని హెడ్ కోచ్‌గా నియమించింది. ఇంతలోనే ఆయనపై వేటు వేసింది.