News October 31, 2024

‘అమరావతి’ డిజైన్లలో మార్పుల్లేవ్: నారాయణ

image

AP: రాజధాని అమరావతి నిర్మాణ పనులకు డిసెంబర్ 31లోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. పాత టెండర్ల కాలపరిమితి ముగిసినందున న్యాయపరమైన చిక్కులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అమరావతి డిజైన్లలో ఎలాంటి మార్పులు లేవని, గతంలో ఉన్నవే కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.

Similar News

News November 19, 2025

ఉమ్మడి KNRలోని ఫేమస్ ‘అయ్యప్ప టెంపుల్స్’..!

image

మెట్‌పల్లి ధర్మశాస్తాలయం, జమ్మికుంట, కేశవపట్నం, గొల్లపల్లి, హుజూరాబాద్, కోరుట్ల <<18317644>>అయ్యప్పగుట్ట<<>>, మల్యాల, రాయికల్, ఇల్లంతకుంట, ధర్మారం, వేములవాడ, ధర్మపురి, ముస్తాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, మంథని, చొప్పదండి, సుల్తానాబాద్, ఎల్లారెడ్డిపేట, కాల్వశ్రీరాంపూర్, గోదావరిఖని, హుస్నాబాద్, KNRలోని భగత్‌‌‌నగర్, జ్యోతినగర్, మధురానగర్, మహాత్మానగర్, కశ్మీర్‌‌గడ్డ, గోదాంగడ్డ, గంగాధర, తీగలగుట్టపల్లి, తిమ్మాపూర్

News November 19, 2025

న్యూస్ రౌండప్

image

✦ TGలో నేటి నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. మ.12 గంటలకు HYD నెక్లెస్ రోడ్డులో ఇందిరా గాంధీ విగ్రహం వద్ద చీరల పంపిణీని ప్రారంభించనున్న CM రేవంత్
✦ పార్టీ ఫిరాయింపులపై నేడు, రేపు MLAల విచారణ.. నేడు తెల్లం వెంకట్రావు, సంజయ్, రేపు పోచారం, అరికెపూడి గాంధీకి సంబంధించిన పిటిషన్ల విచారణ
✦ రేపు బిహార్‌కు CM CBN, మంత్రి లోకేశ్.. నితీశ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడంతో పాటు పారిశ్రామికవేత్తలతో భేటీ

News November 19, 2025

362 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 MTSపోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హత గల అభ్యర్థులు ఈనెల 22 నుంచి DEC 14వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. టైర్ 1, టైర్ 2 రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.mha.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.