News June 26, 2024
విద్య కంటే పెళ్లికే ఎక్కువ ఖర్చు!
ఇండియాలో పిల్లల చదువుపై పెడుతున్న ఖర్చు కంటే పెళ్లిళ్లపై రెండింతలు ఎక్కువ ఖర్చు చేస్తున్నారని జెఫెరీస్ అనే ఓ క్యాపిటల్ మార్కెట్ సంస్థ నివేదిక పేర్కొంది. భారతీయులు ఏటా వివాహాల కోసం రూ.10.70 లక్షల కోట్లు వ్యయం చేస్తున్నారని తెలిపింది. సగటున ఒక పెళ్లికి రూ.12.50 లక్షలు ఖర్చు చేస్తున్నారని, ఇది దంపతుల ప్రీ-ప్రైమరీ నుంచి డిగ్రీ వరకు చదువుపై ఖర్చు కంటే రెండింతలు అని వివరించింది.
Similar News
News October 8, 2024
YELLOW ALERT: రెండు రోజులు వర్షాలు
TGలో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, హైదరాబాద్, నల్గొండ, వరంగల్, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో నేడు APలోని మన్యం, అల్లూరి, ఉ.గో, రాయలసీమ, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో మోస్తరు వానలు కురుస్తాయని APSDMA పేర్కొంది.
News October 8, 2024
మంత్రిపై పరువు నష్టం కేసు.. విచారణకు నాగార్జున
TG: కాంగ్రెస్ మంత్రి సురేఖపై పరువు నష్టం కేసులో నేడు హీరో నాగార్జున విచారణకు హాజరు కానున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల విషయమై మంత్రి చేసిన వ్యాఖ్యలు తమ కుటుంబం పరువు తీశాయని ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నిన్న కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలం ఇవ్వాలని పేర్కొంటూ జడ్జి శ్రీదేవి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు.
News October 8, 2024
అక్రమ కూల్చివేతలకు బ్రేక్!
TG: అక్రమ కూల్చివేతలకు హైడ్రా బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వ్యవస్థను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడంపై హైడ్రా దృష్టి పెట్టిందని ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో 3 నెలలు కూల్చివేతలకు తాత్కాలిక విరామం ఇచ్చిందని తెలిపాయి. అదే సమయంలో చెరువుల సర్వే పూర్తి చేసి, తదుపరి కార్యాచరణ రూపొందించాలని సర్కార్ ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.