News November 23, 2024
ఇద్దరి తనయుల తడాఖా

మహారాష్ట్ర ఎన్నికల్లో ఠాక్రే కుటుంబీకుల యువతరం ఆధిక్యత కనబరుస్తోంది. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లిలో లీడింగ్లో ఉన్నారు. ఇక వీరి బంధువైన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ మహిమ్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News January 18, 2026
‘నారీ నారీ నడుమ మురారి’ కలెక్షన్లు ఎంతంటే?

శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య కాంబినేషన్లో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదలైన మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.8.90 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.13.10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని సినీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతికి ఆఖరి సినిమాగా విడుదలై హిట్ టాక్ వచ్చినా థియేటర్ల కొరత ఉండటం కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోంది. రేపటి నుంచి థియేటర్లు పెరిగే అవకాశం ఉందని సమాచారం. మీరు ఈ మూవీ చూశారా?
News January 18, 2026
జమ్మూకశ్మీర్లో కాల్పులు.. ఏడుగురు సైనికులకు గాయాలు

జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఏడుగురు సైనికులు గాయపడినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఛత్రూ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పాయి. ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నాయి.
News January 18, 2026
రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్గా మారింది: మాజీ మంత్రి

AP: గతంలో క్యాసినోల కోసం శ్రీలంక, గోవా వెళ్లేవారని.. ఇప్పుడు అన్నీ ఏపీలోనే దొరుకుతున్నాయని మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్గా మారిందని ఎద్దేవా చేశారు. MLAలంతా సంపాదనపై పడ్డారని ఆరోపించారు. పేకాట, కోడి పందేలా పేరిట దోచుకో, దాచుకో, పంచుకో అన్నట్లుగా తయారయ్యారని మండిపడ్డారు.


