News November 16, 2024
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్లు

టాలీవుడ్ సింగర్లు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పెళ్లి చేసుకున్నారు. సడన్‌గా వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో అంతా సర్‌ప్రైజ్ అయ్యారు. వీరిద్దరూ కలిసి ఇస్మార్ట్ శంకర్‌లో ‘ఉండిపో’, ఆచార్య సినిమాలో ‘నీలాంబరి’ పాటలు పాడారు. వేర్వేరుగా ఎన్నో హిట్ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించారు.
Similar News
News April 10, 2026
RCB Vs RR.. టాస్ ఆలస్యం

అస్సాంలోని గువాహటిలో జరగాల్సిన RCB-RR మ్యాచ్ టాస్ ఆలస్యంగా పడనుంది. స్టేడియం వద్ద వర్షం కురుస్తోంది. వాన తగ్గాక అంపైర్లు పిచ్‌ను పరిశీలించి టాస్‌పై ప్రకటన చేస్తారు. ఈ నెల 7న రాజస్థాన్-ముంబై మ్యాచ్ సందర్భంగానూ గువాహటిలో భారీ వర్షం కురవడంతో గేమ్‌ను 11 ఓవర్లకు కుదించారు. దీంతో అస్సాంలో మ్యాచులంటే ‘అస్సామే’ అని IPL ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు.
News April 10, 2026
మావిగన్‌తో మరుసటి రోజే రాజధాని: సజ్జల

AP: చంద్రబాబు లెక్క ప్రకారం అమరావతి పూర్తి కావాలంటే రూ.2-3 లక్షల కోట్లు కావాలని, అందుకు 30-40 ఏళ్లు పడుతుందని YCP రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ జగన్ సూచించిన మావిగన్‌లో 10% ఖర్చుతో మరుసటి రోజే రాజధాని అవుతుందని చెప్పారు. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లతో ప్రపంచానికి అనుసంధానమై ఉందని, త్వరలోనే పోర్టు కూడా వస్తుందని తెలిపారు.
News April 10, 2026
ఫిట్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్లేనా?

చాలామంది ఫిట్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్లే అనుకుంటారు. కానీ రెండూ వేరు. హెల్త్ మన శరీరం లోపల అవయవాలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. మంచి నిద్ర, బ్యాలెన్స్‌డ్ ఫుడ్, తక్కువ స్ట్రెస్ ఉంటే హెల్తీగా ఉన్నట్లు లెక్క. మరోవైపు ఫిట్‌నెస్ అంటే శారీరక సామర్థ్యం. బరువులు ఎత్తడం, వేగంగా పరుగెత్తడం వంటివి ఫిట్‌నెస్‌ను సూచిస్తాయి. ఒక బాడీబిల్డర్ చూడటానికి చాలా ఫిట్‌గా ఉన్నా లోపల హెల్తీగా లేకపోవచ్చు.


