News May 23, 2024
వారి బలవంతంతోనే పెళ్లి చేసుకున్నా: కిరణ్ రావు

పేరెంట్స్ బలవంతం వల్లే ఆమిర్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నానని ఆయన మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావు వెల్లడించారు. వివాహానికి ముందు ఏడాది పాటు సహజీవనం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లి వల్ల మహిళలపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఆమిర్, కిరణ్ రావు 2005లో పెళ్లి చేసుకోగా.. 2021లో విడాకులు తీసుకున్నారు. ఇటీవల కిరణ్ రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్’ మూవీ మంచి టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Similar News
News April 18, 2026
మహిళా రిజర్వేషన్: 2034 వరకు ఆగాల్సిందేనా?

2026 జనగణన, డీలిమిటేషన్ పూర్తయ్యాకే ‘నారీ శక్తి వందన్ అధినియం-2023’ చట్టం అమల్లోకి వస్తుందని అప్పట్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. తాజాగా 131వ సవరణ బిల్లు వీగిపోవడంతో 2029లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కష్టమని, 2034 వరకు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పటివరకు మహిళలు వేచి చూడాల్సిందేనేమో!
News April 18, 2026
మహిళలకు విపక్షాల ద్రోహం: CM

AP: మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దారుణమని సీఎం చంద్రబాబు విమర్శించారు. విపక్షాలన్నీ కలిసి మహిళల సాధికారతను అడ్డుకున్నాయని ట్వీట్ చేశారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల వైఖరిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. ఇది రాజకీయ అడ్డంకి మాత్రమే కాదని, కోట్లాది మంది మహిళలకు చేసిన ద్రోహం కూడా అని మండిపడ్డారు.
News April 18, 2026
ఇరాన్, లెబనాన్‌లో మేం సాధించింది ఇదే: ఇజ్రాయెల్

ఇరాన్, లెబనాన్‌పై దాడుల్లో తాము సాధించిన విజయాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ట్వీట్ చేసింది. ఇరాన్‌లో 28 మంది సీనియర్ లీడర్లను అంతం చేశామని, 10,800 దాడులు చేశామని తెలిపింది. 250 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లను నాశనం చేశామని వెల్లడించింది. అటు లెబనాన్‌లో 1700 మందికి పైగా టెర్రరిస్టులను చంపేశామని, 5 వేలకు పైగా ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని వివరించింది.


