News April 10, 2025
మార్స్‌ని గ్రహశకలాలతో ఢీకొట్టించాలి: సైంటిస్ట్

అంగారక గ్రహంపై నివాసానికి పోలిష్ అకాడమీ శాస్త్రవేత్త ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. అంగారక గ్రహాన్ని గ్రహశకలాలతో ఢీకొట్టించాలి అని సూచించారు. తద్వారా అక్కడ మనిషి జీవించడానికి అవసరమైన వాయువులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. మార్స్‌పై CO2 అధికంగా ఉండటంతో దానిపై మనుషులు జీవించడం సాధ్యపడదు. ఊర్ట్ క్లౌడ్‌లోని ఓ మంచు గ్రహశకలం అంగారకుని దగ్గరికి చేరుకోవాలంటే 15వేల సంవత్సరాలు పడుతుందట.
Similar News
News October 23, 2025
నలభై ఏళ్ల తర్వాత మహిళల్లో వచ్చే వ్యాధులివే..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో అనేక వ్యాధులొచ్చే ముప్పు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. పని ఒత్తిడి, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పలు శారీరక, మానసిక వ్యాధులొస్తాయంటున్నారు. ముఖ్యంగా బోలుఎముకలవ్యాధి, గుండె జబ్బులు, రొమ్ము క్యాన్సర్, మానసిక ఒత్తిడి దాడి చేస్తాయంటున్నారు. శరీరంలో హార్మోన్ల మార్పులే వీటికి కారణమంటున్నారు. కాబట్టి మహిళలు 40 తర్వాత తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
News October 23, 2025
పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళనలు: నెట్వర్క్ ఆసుపత్రులు

AP: ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి రూ.250 కోట్లు <<18076438>>రిలీజ్<<>> చేసినా నెట్వర్క్ ఆసుపత్రులు వెనక్కి తగ్గలేదు. తాము డిమాండ్ చేస్తున్న రూ.2,700 కోట్ల పూర్తి బకాయిలను చెల్లించాలని ఆసుపత్రుల అసోసియేషన్ కోరింది. పూర్తి బకాయిలు చెల్లించేవరకు ఆందోళన కొనసాగుతుందని ప్రకటించింది. ప్రభుత్వం విడుదల చేసిన వాటితో సరిపెట్టుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ ‘చలో విజయవాడ మహాధర్నా’ యథాతథంగా ఉంటుందని పేర్కొంది.
News October 23, 2025
AUSvsIND: అడిలైడ్‌లో అదరగొడతారా?

అడిలైడ్ వేదికగా టీమ్ ఇండియా ఇవాళ ఆస్ట్రేలియాతో రెండో వన్డే ఆడనుంది. సిరీస్‌లో నిలవాలంటే తొలి వన్డే ఓడిన గిల్ సేన ఈ మ్యాచులో తప్పక గెలవాలి. అటు కోహ్లీ, రోహిత్ తిరిగి ఫామ్ అందుకోవాల్సి ఉంది. మరోవైపు తొలి వన్డేలో విజయంతో ఆస్ట్రేలియా జోరు మీద ఉంది. దీంతో భారత్‌కు ఈ మ్యాచ్ కఠిన పరీక్ష కానుంది. ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.