News January 23, 2025

మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంపు

image

FEB 1 నుంచి కార్ల ధరలను పెంచబోతున్నట్లు మారుతీ సుజుకీ కంపెనీ ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ.1500 నుంచి రూ.32500 వరకు పెంపు ఉంటుందని తెలిపింది. ముడిసరుకులు, నిర్వహణ ఖర్చులు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామంది. వ్యాగన్ Rపై రూ.13000, బ్రెజాపై రూ.20వేలు, ఎర్టిగాపై రూ.15వేలు, స్విఫ్ట్‌పై రూ.5వేలు, ఆల్టో K10పై రూ.19500, బలెనోపై రూ.9వేలు, గ్రాండ్ విటారాపై రూ.25వేల వరకు ధరల పెంపు ఉంటుందని తెలిపింది.

Similar News

News February 17, 2025

GBSపై ప్రజలకు అవగాహన కల్పించండి: మంత్రి

image

AP: GBS అంటు వ్యాధి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి డోలా వీరాంజనేయస్వామి చెప్పారు. ఇవాళ గుంటూరులో జీజీహెచ్‌లో ఓ మహిళ GBSతో మరణించడంపై ఆయన స్పందించారు. ఈ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయని, వ్యాధి <<15225307>>లక్షణాలు<<>> కనిపిస్తే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ప్రజారోగ్య సంరక్షణే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని తెలిపారు.

News February 17, 2025

మరో 112 మందితో భారత్‌ చేరుకున్న US ఫ్లైట్

image

అక్రమంగా ప్రవేశించారని కొందరు భారతీయులను అమెరికా స్వదేశానికి పంపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా US నుంచి అమృత్‌సర్‌కు 3వ సైనిక విమానం కొద్దిసేపటి కిందటే చేరుకుంది. ఇందులో 112 మంది వివిధ రాష్ట్రాల వాసులున్నారు. ఇప్పటికే 2 విమానాల్లో US అక్రమ వలసదారులను వెనక్కి పంపింది. మరోవైపు, ఈ విమానాలను అమృత్‌సర్‌లోనే ఎందుకు ల్యాండింగ్ చేస్తున్నారని పంజాబ్ CM కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు.

News February 17, 2025

‘ఛావా’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?

image

విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ FEB 14న రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్ విడుదల నుంచే మూవీపై భారీ అంచనాలు ఏర్పడగా, అందుకు తగ్గట్లు నెట్‌ఫ్లిక్స్ పెద్ద మొత్తం చెల్లించి OTT రైట్స్ దక్కించుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యావరేజ్ టాక్ వస్తే నెలకే స్ట్రీమింగ్ చేయాలనుకోగా, పాజిటివ్ టాక్‌తో 8వారాల తర్వాతే OTTలోకి వచ్చే అవకాశముంది. బాలీవుడ్‌లో ‘ఛావా’కు రూ.31cr బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి.

error: Content is protected !!