News August 18, 2025
చాపకింద నీరులా ‘మార్వాడీ గో బ్యాక్’

గో బ్యాక్ మార్వాడీ ఉద్యమం <<17429087>>చాపకింద నీరులా<<>> తెలంగాణ అంతటా విస్తరిస్తోంది. ప్రాంతాలు, ఊర్ల వారీగా వాట్సాప్ గ్రూపుల్లో మార్వాడీల వ్యాపార తీరుకు వ్యతిరేకంగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారి ప్రభావితులైన వారు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. మూమెంట్‌పై ఇంటెలిజెన్స్ కూడా దృష్టిపెట్టిందని సమాచారం. ముందు రోహింగ్యాలను బయటకు పంపాలని BJP అనడంతో ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంది.
Similar News
News August 20, 2025
ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యం: చంద్రబాబు

AP: రతన్ టాటా భరతమాత ముద్దు బిడ్డ అని CM చంద్రబాబు అన్నారు. ఎవరైనా డబ్బు సంపాదించాలని చూస్తారని, టాటా మాత్రం సంపాదనను ఇతరులకు పంచేవారని చెప్పారు. RTIH ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తు అంతా ITదేనని గుర్తు చేశారు. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే సంపద వస్తుందన్నారు. గతంలో ప్రతి ఇంటి నుంచి ఒక ఐటీ నిపుణుడు ఉండాలని పనిచేశామని, ఇప్పుడు ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలన్నదే లక్ష్యమని తెలిపారు.
News August 20, 2025
UPI: స్కాన్ చెయ్ సరుకులు తెచ్చెయ్!!

ఇంటి పక్కన కిరాణా షాపు నుంచి షాపింగ్ మాల్ వరకు కౌంటర్ ఏదైనా.. UPI స్కాన్‌తో కొనేస్తున్నాం. ఈ జులైలో 303 కోట్ల ట్రాన్సాక్షన్లతో (₹64,881Cr) గ్రోసరీస్ టాప్ UPI కేటగిరీగా ఉంది. అంటే పాల ప్యాకెట్లు, ఉప్పు, పప్పులు వగైరా కిరాణా సరుకులు, కాయగూరలకు ఎక్కువ UPI పేమెంట్స్ చేస్తున్నారు. ఇక టీ, టిఫిన్, స్నాక్స్ సెంటర్లది సెకండ్ ప్లేస్ (100 కోట్ల పేమెంట్లు, ₹13794 Cr) . మీరు UPIని ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారు?
News August 20, 2025
మేడారం జాతరకు రూ.150 కోట్లు విడుదల

TG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరగనుంది.