News April 18, 2024
మాచర్లలో మాస్ పోరు.. డబుల్ హ్యాట్రిక్‌పై పిన్నెల్లి గురి!

పల్నాడు(D)లో హాట్‌సీటు మాచర్ల. ఈ ఐదేళ్లలో టీడీపీ, వైసీపీ వర్గ పోరుతో తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతమిది. కాంగ్రెస్ 5 సార్లు, TDP 4 సార్లు, YCP మూడు సార్లు, స్వతంత్రులు, CPI ఒకసారి గెలిచాయి. 2004 నుంచి గెలుస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరోసారి YCP రంగంలోకి దింపింది. ఈయనను దీటుగా ఎదుర్కొనేందుకు మాస్ లీడర్ జూలకంటి బ్రహ్మారెడ్డిని TDP బరిలో నిలిపింది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 7, 2025
DEC9న ‘విజయ్ దివస్’ నిర్వహణ: KTR

TG: KCR ఆమరణ దీక్ష వల్ల 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షకు ఒక రూపం వచ్చిందని BRS నేత KTR పేర్కొన్నారు. ‘11 రోజుల దీక్ష ఫలించి DEC9న ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చింది. KCR త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఆరోజును విజయ దివస్‌గా సంబరాలు జరుపుకోవాలి’ అని పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్సులో పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలున్నందున గ్రామాల్లో కాకుండా నియోజకవర్గాల్లో జరపాలన్నారు. ఏ కార్యక్రమాలు చేపట్టాలో ఆయన వివరించారు.
News December 7, 2025
10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తాం: యజమానుల సంఘం

AP: ఎల్లుండి (డిసెంబర్ 9) అర్ధరాత్రి నుంచి గూడ్స్ రవాణా నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయించింది. 13 ఏళ్లు దాటిన గూడ్స్ వాహనాలపై కేంద్రం పెంచిన టెస్టింగ్, ఫిట్‌నెస్ <<18452599>>ఛార్జీలను<<>> వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసింది. అదనపు ఫీజుల భారం సరుకు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. డిమాండ్లను పట్టించుకోకపోతే రైల్వే షెడ్లు, షిప్‌యార్డుల్లో 10 వేల గూడ్స్ లారీలను నిలిపివేస్తామని హెచ్చరించింది.