News November 1, 2024
భారీగా డ్రగ్స్ పట్టివేత
TG: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను DRI అధికారులు తనిఖీ చేయగా 7కేజీల హైడ్రోఫోనిక్ వీడ్ లభ్యమైంది. NTPS చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీజ్ చేసిన ఈ నిషేధిత పదార్థం విలువ రూ.7కోట్లు ఉంటుందని సమాచారం.
Similar News
News November 1, 2024
రిపబ్లికన్ల ఫారిన్ పాలసీ డిఫరెంట్
అమెరికా ఫస్ట్ నినాదంలో పనిచేసే ట్రంప్ విదేశీ దిగుమతులపై సార్వత్రిక సుంకం 20% విధించాలన్న అతని ప్రణాళికలు ట్రేడ్ వార్‌కు దారి తీయవచ్చని భావిస్తున్నారు. ఇక వాతావరణ మార్పులను లైట్ తీసుకొనే ట్రంప్ బైడెన్ తెచ్చిన పర్యావరణ చట్టాలను రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మద్దతు నిలిపివేసి మాస్కో శాంతి ఒప్పందానికి అంగీకరించేలా కీవ్‌పై ఒత్తిడి తేవచ్చని అభిప్రాయపడుతున్నారు.
News November 1, 2024
విద్యార్థులకు కొత్త డైట్ ప్లాన్: సీఎం రేవంత్
TG: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్‌లో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో కొత్త డైట్‌ను తీసుకురావాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సీఎంను కలిసి పలువురు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
News November 1, 2024
రవీంద్ర జడేజా సరికొత్త ఘనత
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త ఘనత సాధించారు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా ఆయన రికార్డులకెక్కారు. ఇప్పటివరకు జడ్డూ 315 వికెట్లు తీశారు. ఈ క్రమంలో మాజీ ఫాస్ట్ బౌలర్లు జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ (311) లను ఆయన అధిగమించారు. అగ్ర స్థానంలో అనిల్ కుంబ్లే (619) కొనసాగుతున్నారు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (533), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417) ఉన్నారు.