News November 1, 2024

భారీగా డ్రగ్స్ పట్టివేత

image

TG: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను DRI అధికారులు తనిఖీ చేయగా 7కేజీల హైడ్రోఫోనిక్ వీడ్ లభ్యమైంది. NTPS చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీజ్ చేసిన ఈ నిషేధిత పదార్థం విలువ రూ.7కోట్లు ఉంటుందని సమాచారం.

Similar News

News December 9, 2024

‘పుష్ప-2’పై రోజా ప్రశంసలు

image

‘పుష్ప-2’ సినిమాపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఐకాన్ స్టార్.. మీ పుష్ప-2 చిత్రం అంచనాలకు మించింది. పుష్పతో తగ్గేదేలే అన్నారు. Pushpa2తో అస్సలు తగ్గేదేలే అనిపించారు. మా చిత్తూరు యాస వెండితెరపై పలికిన తీరు హాల్‌లో ఈలలు వేయిస్తోంది. మీ నటన అద్భుతం, యావత్ దేశాన్నే మీ మాస్ ఇమేజ్‌తో పుష్పా అంటే ఫ్లవర్ కాదు ఫైర్.. వైల్డ్ ఫైర్ అని పూనకాలు పుట్టించారు’ అని ట్వీట్ చేశారు.

News December 9, 2024

ప్రభాస్ కోసం కథ రాసిన హీరో రిషబ్ శెట్టి?

image

‘కాంతార’ సినిమాతో సినీ ప్రపంచాన్ని షేక్ చేసిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం ఓ కథను రాసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. హొంబలే ఫిల్మ్స్ నిర్మించనున్న చిత్రాల్లో ఒక దానికి కథను అందించారని, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదని తెలిపాయి. కాగా, సదరు నిర్మాణ సంస్థ ప్రస్తుతం ప్రభాస్‌తో మొత్తం మూడు సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే.

News December 9, 2024

సిరియాపై భారత ప్రభుత్వ కీలక ప్రకటన

image

సిరియాలో పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐక్యత, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు ఆ దేశంలోని అన్ని వర్గాలూ కలిసి పనిచేయాలని సూచించింది. ‘అన్ని వర్గాల ఆకాంక్షలు, ప్రయోజనాలను గౌరవిస్తూ సమ్మిళిత సిరియా నాయకత్వంలో రాజకీయ ప్రక్రియ శాంతియుతంగా సాగాలని మేం కోరుకుంటున్నాం’ అని MEA తెలిపింది. అక్కడి భారతీయులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించింది.