News February 9, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్ అడవులు తుపాకుల మోతలతో మళ్లీ దద్దరిల్లాయి. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కులో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన భీకర కాల్పుల్లోనూ పదుల సంఖ్యలో మావోలు మరణించిన విషయం తెలిసిందే.

Similar News

News March 17, 2025

‘ఫ్యామిలీ రూల్‌’పై అనుష్క శర్మ పోస్ట్.. వైరల్

image

బీసీసీఐ ప్రవేశపెట్టిన ‘ఫ్యామిలీ రూల్‌’పై టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పరోక్షంగా స్పందించారు. ‘నువ్వు తెలిసిన ప్రతి ఒక్కరి మనసులో నీ గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి. కానీ నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు’ అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా టూర్లలో క్రికెటర్లతోపాటు వారి కుటుంబాలు, సన్నిహితులు ఉంటే బాగుంటుందని విరాట్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

News March 17, 2025

అత్యధిక పన్ను చెల్లించే నటుడు ఎవరంటే?

image

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇన్కమ్‌ట్యాక్స్ చెల్లించడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన అడ్వాన్స్‌ ట్యాక్స్ రూ.52.50కోట్లు చెల్లించినట్లు సినీవర్గాలు తెలిపాయి. కాగా, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ.350 కోట్లు సంపాదించినట్లు పేర్కొన్నాయి. తద్వారా రూ.120 కోట్లు పన్ను చెల్లించి అత్యధికంగా పన్ను చెల్లించిన నటుడిగా నిలిచినట్లు వెల్లడించాయి. 85 సంవత్సరాల వయసులోనూ ఆయన ఎంతో డిమాండ్ ఉన్న నటుడిగా ఉన్నారు.

News March 17, 2025

11 మంది సెలబ్రిటీలపై కేసులు

image

TG: బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. 11 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌, శ్యామల, కిరణ్ గౌడ్‌, సన్నీ యాదవ్‌, సుధీర్ రాజు, అజయ్‌పై కేసులు నమోదయ్యాయి.

error: Content is protected !!