News May 4, 2024
GTతో మ్యాచ్.. RCB టార్గెట్ 148

RCBతో మ్యాచ్లో GT 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సాహా 1, గిల్ 2, సాయి సుదర్శన్ 6 విఫలమయ్యారు. షారుక్ 37, మిల్లర్ 30, తెవాటియా 35 పరుగులతో రాణించారు. సిరాజ్, యశ్ చెరో రెండు వికెట్లు తీయగా, గ్రీన్, కరణ్ శర్మ చెరో వికెట్ తీశారు. వైశాఖ్ వేసిన చివరి ఓవర్ తొలి 3 బంతులకు 3 వికెట్లు పడ్డాయి. తొలి బంతికి మనవ్ సుతార్(క్యాచ్), రెండో బంతికి మోహిత్(రనౌట్), మూడో బంతికి విజయ్(క్యాచ్) ఔటయ్యారు.
Similar News
News November 19, 2025
ASF: సర్పంచ్ ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలి

ASF జిల్లాలో సర్పంచ్ ఆశావహులు సిద్ధంగా ఉండాలని డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు సూచించారు. సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 2వ వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా బరిలోకి దిగే అభ్యర్థులు, ఆశావహులు డీసీసీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News November 19, 2025
X(ట్విటర్) డౌన్

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X(ట్విటర్) డౌన్ అయింది. ట్వీట్లు చేయలేకపోతున్నామని యూజర్లు ఇతర SM పేజీల్లో కామెంట్లు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇదే తరహా ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? COMMENT
News November 19, 2025
చలికి చర్మం పగులుతుందా?

చలి పెరగడంతో శరీరం పగిలి ఇబ్బందిపడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే చిట్కాలు పాటించి చర్మాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘రోజుకు కనీసం రెండుసార్లు స్నానం చేసిన వెంటనే & పడుకునే ముందు మందపాటి, ఆయిల్ ఆధారిత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనె రాయండి. చలికాలంలో కూడా రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగితే చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్గా ఉంచవచ్చు. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి’ అని తెలిపారు.


