News May 4, 2024

GTతో మ్యాచ్.. RCB టార్గెట్ 148

image

RCBతో మ్యాచ్‌లో GT 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సాహా 1, గిల్ 2, సాయి సుదర్శన్ 6 విఫలమయ్యారు. షారుక్ 37, మిల్లర్ 30, తెవాటియా 35 పరుగులతో రాణించారు. సిరాజ్, యశ్ చెరో రెండు వికెట్లు తీయగా, గ్రీన్, కరణ్ శర్మ చెరో వికెట్ తీశారు. వైశాఖ్ వేసిన చివరి ఓవర్ తొలి 3 బంతులకు 3 వికెట్లు పడ్డాయి. తొలి బంతికి మనవ్ సుతార్(క్యాచ్), రెండో బంతికి మోహిత్(రనౌట్), మూడో బంతికి విజయ్(క్యాచ్) ఔటయ్యారు.

Similar News

News November 14, 2024

సచివాలయ ఉద్యోగులకు అలర్ట్

image

AP: రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 1నుంచి 30వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.

News November 14, 2024

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు

image

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కనుమూరు రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికైనట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అధికారికంగా ప్రకటించారు. కాగా డిప్యూటీ స్పీకర్ పదవికి RRR తప్ప మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

News November 14, 2024

సీనరేజ్ మినహాయిస్తూ AP సర్కార్ నిర్ణయం

image

AP: అమరావతి చుట్టూ ORR, విజయవాడ ఈస్ట్ బైపాస్‌లకు చిన్నతరహా ఖనిజాలకు సీనరేజ్ మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.6వేల కోట్లకు పైగా ఖర్చయ్యే 189కి.మీ ORR, 50కి.మీ. బైపాస్ కోసం భూసేకరణను NHAI, MORTH భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్నికోరింది. దానికి ప్రత్యామ్నాయంగా పై నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఈ 2నిర్మాణాల కోసం స్టీల్, సిమెంట్, తదితరాలకు రాష్ట్ర GST మినహాయింపునకు ముందుకొచ్చింది.