News March 27, 2024
ఉప్పల్‌లో మ్యాచ్.. మెట్రో టైమింగ్‌లో మార్పు

సన్ రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం సిద్ధమైంది. ఈక్రమంలో మ్యాచ్ చూసేందుకు ఉప్పల్‌కు వచ్చే క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. చివరి మెట్రో రైళ్లు వాటి టెర్మినల్ నుంచి రాత్రి 12.15 గంటలకు బయల్దేరి 1.10 గంటలకు తమ గమ్యస్థానాలకు చేరుకుంటాయని తెలిపింది. నాగోల్, ఉప్పల్, స్టేడియం & NGRI స్టేషన్‌లలో మాత్రమే ప్రవేశం ఉంటుందని వెల్లడించింది.
Similar News
News March 7, 2026
పాక్‌లో భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు

ఇరాన్-US యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్‌లో పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వం లీటర్‌పై ఏకంగా 55 PKR(17 శాతం) పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 266.17 PKR నుంచి 321.17 PKRకు పెరిగింది. హైస్పీడ్ డీజిల్ ధర లీటర్‌కు 280.86 నుంచి 335.86కి(20%) ఎగిసింది. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందో చెప్పలేమని పాక్ పెట్రోలియం మంత్రి మాలిక్ అన్నారు. ఇండియాలోనూ <<19316911>>గ్యాస్ ధరలు<<>> పెరిగిన విషయం తెలిసిందే.
News March 7, 2026
విటమిన్ల కోసం వీటిని తీసుకోండి!

శరీర ఎదుగుదలకు, రోగనిరోధక శక్తికి విటమిన్లు అత్యవసరం. క్యారెట్లు, లివర్‌లో విటమిన్ A ఉంటుంది. B1- తృణధాన్యాలు, చిక్కుళ్లు. B2- పాలు, గుడ్లు, పాలకూర. B3 – చికెన్, వేరుశెనగ. B5- అవకాడో, గుడ్లు. B6- అరటిపండు, సాల్మన్ ఫిష్. B7- గుడ్లు, బాదం, కాలీఫ్లవర్. B12- చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు. D – సూర్యకాంతి, చేపలు, పాలు. K- కాలే, బ్రోకలీ, సోయాబీన్స్. E- సన్‌ఫ్లవర్ సీడ్స్, బాదం. C -నారింజ, జామ. SHARE IT
News March 7, 2026
విజయ్‌కి భార్య షాక్.. కోర్టులో మరో పిటిషన్!

టీవీకే అధినేత విజయ్‌కి ఆయన భార్య సంగీత <<19295692>>మరోసారి<<>> షాక్ ఇచ్చారు. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో ఆమె మరో పిటిషన్ దాఖలు చేశారు. తమ విడాకుల కేసు ముగిసే వరకు తాను విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతివ్వాలని అందులో కోరారు. ‘చెన్నై నీలంకరైలోని ఇంట్లో నాకూ సగం వాటా ఉంది. విడాకుల కేసు ముగిసే వరకు, నేను వేరే ఇంటికి మారే వరకు అక్కడ ఉండేందుకు అనుమతించాలి’ అని తన పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది.


