News June 12, 2024

భారత్‌తో మ్యాచ్.. USA చెత్త రికార్డు

image

భారత్‌తో జరుగుతున్న మ్యాచులో USA చెత్త రికార్డు నమోదు చేసింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియాపై పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. ఇవాళ్టి మ్యాచులో USA 6 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 18 పరుగులు చేసింది. ఈ WCలో ఇది మూడో అత్యల్ప స్కోరు. దక్షిణాఫ్రికా(16/4), నమీబియా(17/3) ముందు స్థానాల్లో ఉన్నాయి.

Similar News

News October 24, 2025

ఇక ఇంటర్ ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్

image

TG: ఇంటర్ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేలా బోర్డు ప్రతిపాదనలకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకు సెకండియర్‌కు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. వచ్చే ఏడాది నుంచి ఫస్టియర్ విద్యార్థులకు సైతం ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. అన్ని సబ్జెక్టుల్లో 80% రాత పరీక్ష, 20% మార్కులు ఇంటర్నల్స్‌కు కేటాయిస్తారు. ఇంటర్‌లో కొత్తగా ACE(ఎకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపును ప్రవేశ పెట్టనున్నారు.

News October 24, 2025

కెనడాతో ట్రంప్ కటీఫ్.. ట్రేడ్ చర్చలు రద్దు!

image

కెనడాతో అన్ని రకాల ట్రేడ్ చర్చలను రద్దు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఓ యాడ్‌లో Ex ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్‌ను తప్పుగా ఉటంకించిందని ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘కెనడా మోసపూరితంగా యాడ్‌ చేసిందని రొనాల్డ్ రీగన్ ఫౌండేషన్ ప్రకటించింది. అది ఫేక్ యాడ్. టారిఫ్స్‌పై రీగన్ నెగటివ్‌గా మాట్లాడుతున్నట్లు ఉంది’ అని ట్రంప్ చెప్పారు. US జాతీయ భద్రత, ఎకానమీకి టారిఫ్స్ చాలా ముఖ్యమని అన్నారు.

News October 24, 2025

పసుపును అంతర పంటగా ప్రోత్సహించాలి: తుమ్మల

image

పామాయిల్ సహా ఇతర పంటల్లో పసుపును అంతర పంటగా సాగుకు చర్యలు తీసుకోవాలని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అధిక నాణ్యత గల పసుపు రకాలను రైతులకు అందించి వాటి సాగును ప్రోత్సహించాలన్నారు. మంత్రి తుమ్మలను కలిసిన జాతీయ పసుపుబోర్డు కార్యదర్శి భవానిశ్రీ గత ఆరు నెలల్లో బోర్డు పనితీరును వివరించారు. పసుపు ఉడకబెట్టే యంత్రాలు, గ్రైండర్లను రైతులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.