News June 12, 2024
భారత్‌తో మ్యాచ్.. USA చెత్త రికార్డు

భారత్‌తో జరుగుతున్న మ్యాచులో USA చెత్త రికార్డు నమోదు చేసింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియాపై పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. ఇవాళ్టి మ్యాచులో USA 6 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 18 పరుగులు చేసింది. ఈ WCలో ఇది మూడో అత్యల్ప స్కోరు. దక్షిణాఫ్రికా(16/4), నమీబియా(17/3) ముందు స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News March 19, 2025
వేసవిలో కూల్ వాటర్ తాగుతున్నారా?

వేసవిలో రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన నీటిని తాగవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండవేడికి తాళలేక చల్లగా ఉన్న నీటిని తాగితే శరీరం వాటిని తీసుకోలేదు. దీంతో తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి. జీర్ణాశయం పనితీరు నెమ్మదించి మలబద్ధకం, అజీర్తి సమస్యలు ఏర్పడుతాయి. ఎండ నుంచి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగితే జలుబు, గొంతు మంట వచ్చే అవకాశముంది. దంతాలు దెబ్బతినే ఛాన్స్ ఉంది. మట్టికుండలోని నీరు తాగడం ఉత్తమం.
News March 19, 2025
బైడెన్ మా ప్రతిపాదనలు స్వీకరించలేదు: మస్క్

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపైకి చేరుకున్న నేపథ్యంలో స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలోనే సునీత, విల్మోర్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు తాము చేసిన ప్రతిపాదనలను రాజకీయ కారణాలతో బైడెన్ స్వీకరించలేదని అన్నారు. ఆయన తమ సూచనలు తీసుకొని ఉంటే వ్యోమగాములు ముందుగానే భూమిపైకి వచ్చేవారన్నారు. గతేడాది స్పేస్ షిప్‌లో సమస్యలు రావడంతో సునీత, విల్మోర్ రాక ఆలస్యమైంది.
News March 19, 2025
విద్యార్థులకు షాక్.. ఫీజులు భారీగా పెంపు

TG: పాలిటెక్నిక్ కోర్సు గరిష్ఠంగా రూ.39వేలకు పెరిగింది. దశాబ్ద కాలం నుంచి ఫీజుల పెంపు లేదని కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా రూ.40వేల వరకు వసూలు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచే వర్తిస్తుందని పేర్కొంది. కాగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.14,900 చెల్లిస్తోంది. మరోవైపు నేటి నుంచి పాలిసెట్ <