News May 11, 2024

KKRతో మ్యాచ్.. ముంబై టార్గెట్ 158 రన్స్

image

వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో KKR 157/7 స్కోరు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 42, నితీశ్ రాణా 33, రస్సెల్ 24, రింకూ సింగ్ 20 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా, బుమ్రా చెరో రెండు వికెట్లు, అన్షుల్ కాంబోజ్, నువాన్ తుషారా చెరో వికెట్ తీశారు.

Similar News

News March 17, 2026

ఆస్కార్: దురదృష్టంలో ఈమెది ఆల్ టైమ్ రికార్డు!

image

ఆస్కార్ <<19394758>>అవార్డుల<<>> విషయంలో పాటల రచయిత డయానె వారెన్‌ది ఓ దురదృష్ట గాధ. దశాబ్దాలుగా నామినేషన్లలో ఉంటున్నా చివరికొచ్చే సరికి ఆమెకు నిరాశ తప్పడం లేదు. ఇలా ఏకంగా 17 సార్లు మొండిచెయ్యే దక్కింది. ఆస్కార్ చరిత్రలో ఇదో రికార్డు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో వరుసగా 9 సార్లు ఎంపికైనా అదృష్టం మాత్రం వరించలేదు. ‘నేను కొత్త రికార్డు సృష్టించా. మీరు అనుమతిస్తే మరోసారి తిరిగొస్తా’ అని FBలో వారెన్ రాసుకొచ్చారు.

News March 17, 2026

మార్చి17: చరిత్రలో ఈరోజు

image

*1892: తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు జననం
*1896: నిజాం విమోచన పోరాట యోధుడు మందుముల నరసింగరావు జననం
*1962: ఇండో-అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా జననం
*1975: కన్నడ నటుడు పునీత్ కుమార్ జననం
*1990: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ జననం (ఫొటోలో)

News March 17, 2026

రికార్డులు బ్రేక్ చేస్తున్న ధురంధర్-2

image

ధురంధర్-2 మూవీ విడుదలకు ముందే రికార్డులు బ్రేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే అత్యధిక కలెక్షన్లు (₹37.5Cr) సాధించిన చిత్రంగా నిలిచిందని సినీ వర్గాలు చెప్పాయి. ఇప్పటిదాకా ₹25Crతో OG తొలి ప్లేస్‌లో ఉందని తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో ₹120Cr వసూళ్లు సాధించిందని, రిలీజ్‌కు 2 రోజులుండటంతో ఇవి ₹150Cr దాటొచ్చని పేర్కొన్నాయి. ప్రీమియర్స్, తొలి రోజుకు 10 లక్షల టికెట్లు సేల్ అయినట్లు చెప్పాయి.