News November 16, 2024
మట్కా: రెండు రోజుల కలెక్షన్లు ఎంతంటే?
పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘మట్కా’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లో రూ.1.10 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. విడుదలకు ముందు రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినా బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో రూ.19 కోట్లు రావాలని పేర్కొన్నాయి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు.
Similar News
News December 9, 2024
12 నెలల్లో 12 ఏళ్ల వ్యతిరేకత: కిషన్ రెడ్డి
TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 12 నెలల్లోనే 12 ఏళ్ల వ్యతిరేకతను ఎదుర్కొంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాలనలో BRSకు కాంగ్రెస్‌కు తేడా లేదని చెప్పారు. ప్రజల బతుకు పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందన్నారు. రేవంత్ పాలనకు పాస్ మార్కులిచ్చే పరిస్థితే లేదని విమర్శించారు. ఒక్క రేషన్ కార్డు, ఇల్లు కూడా ఇవ్వలేని వారు విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు.
News December 9, 2024
శాంతిభద్రతలే ఆప్ ఎన్నికల అజెండా!
ఢిల్లీలో లా అండ్ ఆర్డర్‌ను ఆప్ ఎన్నికల అజెండాగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన వరుస హత్యలు, వేల కోట్ల డ్రగ్స్ రాకెట్ అంశాల చుట్టూ ఆప్ నెరేటివ్ బిల్డ్ చేస్తోంది. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం శాఖ డైరెక్షన్‌లో పనిచేస్తారు కాబట్టి అమిత్ షాను టార్గెట్ చేస్తోంది. చైన్, ఫోన్ స్నాచింగ్, ఎక్స్‌టార్షన్స్, మహిళ్లలో అభద్రతా భావానికి కేంద్రం వైఫల్యాలే కారణమంటూ విమర్శిస్తోంది.
News December 8, 2024
నిద్ర పోయేటప్పుడు ఇలా చేస్తున్నారా?
పడుకునే సమయంలో చాలా మంది దోమల బెడదను తప్పించుకునేందుకు దోమల నివారణ యంత్రాలను వాడుతారు. వీటిని వాడటం వల్ల హానికరమైన రసాయనాలు వెలువడుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. దీంతో శ్వాస, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇవి కాస్త క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కర్పూరం పొగ, వేపాకులను కాల్చడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.