News September 13, 2024

‘మత్తు వదలరా-2’ మూవీ పబ్లిక్ టాక్

image

శ్రీసింహా కోడూరి, క‌మెడియ‌న్ స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మత్తు వదలరా-2’ థియేటర్లలో రిలీజైంది. ప్రీమియర్స్ చూసిన వాళ్లు Xలో అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. సత్య కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించారంటున్నారు. చిరంజీవి రిఫరెన్స్ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు. ట్రెండ్​కు తగ్గట్టు డైరెక్టర్ మీమ్స్ స్టఫ్‌ను వాడుకున్నారంటున్నారు.
>> మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ

Similar News

News November 2, 2025

చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే..?

image

శివుడు అభిషేక ప్రియుడు. అందుకే నీటితో అభిషేకం చేసినా ఆయన అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతుంటారు. అయితే చెరకు రసంతో శివుడిని అభిషేకం చేయడం మరింత పుణ్యమని అంటున్నారు. ‘చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తొలగి, ధనవృద్ధి కలుగుతుంది. ఈ అభిషేకం ద్వారా చెరుకు లాగే భక్తుల జీవితం కూడా మధురంగా మారుతుందని నమ్మకం. అప్పుల బాధలు తొలగి, ధనానికి లోటు లేకుండా జీవించడానికి ఈ అభిషేకం చేయాలి’ అంటున్నారు.

News November 2, 2025

అడుగులోనే అరక విరిగిందట

image

పొలం దున్నడానికి ఉపయోగించే ముఖ్యమైన వ్యవసాయ పనిముట్టు అరక. పొలం దున్నడం మొదలుపెట్టి, ఒక అడుగు వేయకముందే లేదా మొదటి అడుగులోనే, ప్రధానమైన పనిముట్టు అయిన అరక విరిగిపోతే పని ముందుకు సాగదు. ఏదైనా ఒక కార్యాన్ని లేదా ప్రయత్నాన్ని ప్రారంభించిన తక్షణమే ఊహించని సమస్య లేదా అవాంతరం ఎదురై మొత్తం ప్రణాళిక లేదా ప్రయత్నం విఫలమైనప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు.

News November 2, 2025

నేడే మూడో T20.. సమం చేస్తారా?

image

నేడు ఓవల్ వేదికగా IND, AUS మధ్య మూడో టీ20 జరగనుంది. రెండో T20లో ఘోర వైఫల్యం తర్వాత టీమ్‌ఇండియా కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సూర్య(C), గిల్ గాడిలో పడాలి. తిలక్ వర్మ, దూబే, శాంసన్‌ల నుంచి భారీ స్కోర్ బాకీ ఉంది. AUS బౌలర్ హేజిల్‌వుడ్ లేకపోవడం కలిసొచ్చే అంశం. అర్ష్‌దీప్ ఉంటారా.. లేదా? అన్న దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. మ.1.45 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.