News May 1, 2024
ఈనెల గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ: IMD

దేశంలో ఈనెల భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటుందని IMD హెచ్చరించింది. ‘రెండు నుంచి ఎనిమిది రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఈనెల సాధారణం కంటే ఎక్కువ ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు, సెంట్రల్ ఇండియా, వాయువ్య భారతం ఇందుకు మినహాయింపు. కాగా ఏప్రిల్‌లో 1901 తర్వాత ఆ స్థాయిలో దక్షిణ భారతంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు (31 డిగ్రీల సెల్సియస్) నమోదు కావడం ఇది రెండోసారి’ అని తెలిపింది.
Similar News
News March 4, 2026
ఇరాన్ నౌకపై అమెరికా దాడి.. 100 మంది మృతి!

శ్రీలంకలో <<19296909>>ఇరాన్ నౌక<<>>పై జరిగిన దాడిలో 100 మంది చనిపోయారని తెలుస్తోంది. IRIS Dena షిప్ మునిగిపోయిందని, పలు బాడీలను గుర్తించామని శ్రీలంక నేవీ పేర్కొంది. నౌకలో 180 మంది సిబ్బంది ఉండగా, 30 మందిని కాపాడామని చెప్పింది. ఈ దాడి చేసింది తామేనని అమెరికా ప్రకటించింది. సబ్‌మెరైన్‌తో నౌకను పేల్చేసినట్లు వెల్లడించింది. FEB 18న విశాఖలో జరిగిన విన్యాసాల్లో ఈ షిప్ పాల్గొని తిరిగి వెళ్తుండగా అటాక్ జరగడం గమనార్హం.
News March 4, 2026
24,800 మంది బోగస్ ఉద్యోగులు… జీతం కింద ప్రైవేటు ఏజెన్సీలకు రూ.కోట్లు

TG: GOVTలో దాదాపు 3.70L మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారని, వారిలో 24,800 మంది బోగస్ ఉద్యోగులేనని మాజీ CS శాంతి కుమారి కమిటీ తేల్చింది. ఇంకా 14 శాఖల వివరాలు వస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. బ్యాంకుఖాతా, పాన్, ఆధార్ లేకుండానే 10 ఏళ్లకు పైగా జీతం కింద ప్రైవేటు ఏజెన్సీలకు రూ.కోట్లు ఇస్తున్నారు. ఈ రిపోర్టు CMకు అందగా, వారి జీతాల చెల్లింపును నిలిపేయాలని ఆయన ఆదేశించారు.
News March 4, 2026
T20 WC ఎఫెక్ట్.. బాబర్‌పై పాక్ వేటు!

T20 WCలో విఫలమైన పాక్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజమ్‌పై PCB వేటువేసింది. బంగ్లాదేశ్‌తో జరిగే ODI సిరీస్ నుంచి అతడిని పక్కన పెట్టింది. షాహీన్ అఫ్రీది కెప్టెన్‌గా 15 మందితో స్క్వాడ్‌ను తాజాగా ప్రకటించింది. ఇందులో ఆరుగురు కొత్త ప్లేయర్లను తీసుకోవడం గమనార్హం. ఈ నెల 11 నుంచి పాక్-బంగ్లా మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. T20 WCలో 4 ఇన్నింగ్స్‌లలో బాబర్ 91 పరుగులే చేశారు. అత్యధికంగా UAEపై 46 రన్స్ కొట్టారు.


