News June 21, 2024

‘ఇంద్ర దేవుడా వర్షాలు కురిపించయ్యా’.. యూపీ వాసి లేఖ

image

వడగాలుల ధాటికి తట్టుకోలేక ఉత్తరాది అవస్థలు పడుతున్న వేళ యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ అడ్వొకేట్ ఇంద్రుడికి లేఖ రాశాడు. కొన్నిరోజులుగా భానుడి భగభగలు తట్టుకోలేక కాన్పూర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అతుల్ సన్వారే పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలతో ఊరట కల్పించాలని వరుణుడిని వేడుకున్నాడు. అయితే వడగళ్ల వానను మాత్రం కురిపించొద్దని, అలాగే రోజూ గాలి వీచేలా వాయు దేవుడిని రిక్వెస్ట్ చేయమని కోరాడు.

Similar News

News September 17, 2024

‘మ్యాడ్’ సీక్వెల్‌పై రేపే అప్డేట్

image

నార్నె నితిన్ హీరోగా సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’కు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌, ఫస్ట్ సింగిల్‌ను రేపు ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ‘మ్యాడ్ మ్యాక్స్‌తో బాయ్స్ మళ్లీ రాబోతున్నారు’ అని పోస్టర్‌ రిలీజ్ చేశారు. కాగా ‘మ్యాడ్’ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

News September 17, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

News September 17, 2024

19 నుంచి ఆన్‌లైన్‌లో టెట్ మాక్ టెస్టులు

image

AP: టెట్ మాక్ టెస్ట్‌లను 19వ తేదీ నుంచి ఆన్‌లైన్(http://cse.ap.gov.in)లో అందుబాటులో ఉంటాయని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. మాక్ టెస్టులను సాధన చేయడం ద్వారా ఆన్లైన్లో నిర్వహించే పరీక్షలను ఇబ్బంది లేకుండా రాయడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ఈ నెల 22వ తేదీ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. షెడ్యూల్ ప్రకారమే అక్టోబర్ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.