News October 25, 2024
మాయదారి ‘మయోనైజ్’ మాయం?
షవర్మా, మండి బిర్యానీ వంటి ఆహారాల్లో వాడే మయోనైజ్ నిషేధానికి TG ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో అనారోగ్యానికి గురవుతున్నట్లు GHMCకి ఫిర్యాదులు రావడంతో బ్యాన్‌కు అనుమతించాలని ప్రభుత్వానికి బల్దియా లేఖ రాసింది. దీన్ని పరిశీలిస్తున్న సర్కార్ రాష్ట్రమంతా బ్యాన్ చేయొచ్చని సమాచారం. గుడ్డు సొన, నూనె, నిమ్మరసం, ఉప్పుతో వండకుండా చేసే ఈ పదార్థంలో హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది. మీరూ దీని బాధితులేనా?
Similar News
News November 2, 2024
డెమోక్రాట్లకు తగ్గుతున్న భారతీయ అమెరికన్ల మద్దతు
అమెరికాలోని 52 లక్షల మంది భారతీయ అమెరికన్లలో ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో 26 లక్షల మంది అర్హులు ఓటు వేయనున్నారు. గతంలో ఉదారవాద భావాలున్న డెమోక్రాట్లకు వీరు అనుకూలంగా ఉన్నారు. అయితే క్రమేణా వారికి దూరమవుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. 2020 ఎన్నికల్లో 56% మంది డెమోక్రాట్లకు మద్దతు ఇవ్వగా, 2024లో 47% మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టు ఇండియన్ అమెరికన్ ఆట్టిట్యూడ్స్ సర్వేలో తేలింది.
News November 2, 2024
అండర్ వరల్డ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపులు: మాజీ ప్రేయసి
గతంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు అండర్ వరల్డ్ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ తెలిపారు. సల్మాన్‌తోపాటు గ్యాలెక్సీ అపార్ట్‌మెంట్‌లో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయని చెప్పారు. ‘ఓ రోజు సల్మాన్ ఫోన్‌కు ఎవరో కాల్ చేయగా నేను లిఫ్ట్ చేశా. సల్మాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయం ఆయనతో చెప్పగానే కాస్త భయపడ్డారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ కాల్స్ రాలేదు’ అని గుర్తు చేసుకున్నారు.
News November 2, 2024
సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు: మంత్రి
TG: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ‘లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేశాం. మొత్తం 4 దశల్లో ఇళ్లు కేటాయిస్తాం. మొదటిదశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తాం. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల వివరాలను ప్రకటిస్తాం. 400 చ.అడుగుల్లో ఇంటి నిర్మాణం ఉంటుంది. సొంత స్థలం ఉన్న వారికి రూ.5లక్షలు దశల వారీగా ఇస్తాం. ఇంటి యజమానిగా మహిళనే గుర్తిస్తాం’ అని ఆయన వెల్లడించారు.