News December 7, 2024

మాయలఫకీర్‌లా రేవంత్ డ్రామాలు: జేపీ నడ్డా

image

TG: రేవంత్ ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. సరూర్ నగర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. మాయలఫకీర్‌లా రేవంత్ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హామీల అమలులోనూ రేవంత్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి అని మండిపడ్డారు.

Similar News

News December 3, 2025

APPLY NOW: 252 అప్రెంటిస్ పోస్టులు

image

<<-1>>RITES<<>>లో 252 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీ, BE, B.Tech, బీఆర్క్, డిప్లొమా, ITI ఉత్తీర్ణులు అర్హులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు 146 ఉండగా.. డిప్లొమా అప్రెంటిస్‌లు 49, ITI ట్రేడ్ అప్రెంటిస్‌లు 57 ఉన్నాయి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://www.rites.com/

News December 3, 2025

రూ.2లక్షలు క్రాస్ చేసిన KG వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ వెండిపై రూ.5వేలు పెరిగి చాలారోజులకు రూ.2లక్షల మార్కును దాటింది. ఇవాళ కేజీ సిల్వర్ రేటు రూ.2,01,000గా ఉంది. అటు 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,30,580గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.650 ఎగబాకి రూ.119700 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 3, 2025

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్

image

TG: తరం మారింది. తలరాతలు మార్చే ప్రచార వేదికలూ మారుతున్నాయి. ప్రతి ఒక్కరి చేతుల్లోని స్మార్ట్ ఫోన్‌ను చేరేలా పంచాయతీ అభ్యర్థుల ప్రచారం సాగుతోంది. దీంతో గోడలపై, ఇళ్లకు పోస్టర్లు, మైకుల సందడికి సోషల్ మీడియా అదనంగా చేరింది. రెగ్యులర్ ఆఫ్‌లైన్ క్యాంపెయిన్లతో పాటు వాట్సాప్‌లో వీడియోలతోనూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఊరి వాట్సాప్ గ్రూప్స్‌లో డిస్కషన్స్ పోల్స్ రిజల్ట్‌ను బట్టి హామీలు, వ్యూహాలూ మారుతున్నాయి.