News October 7, 2024
మయాంక్ యాదవ్ అరుదైన ఘనత

టీమ్ ఇండియా క్రికెటర్ మయాంక్ యాదవ్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ఓవర్‌ను మెయిడెన్‌గా ముగించారు. దీంతో అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్ వేసిన మూడో భారత బౌలర్‌గా రికార్డులకెక్కారు. గతంలో 2006లో సౌతాఫ్రికాపై అజిత్ అగార్కర్, 2022లో ఇంగ్లండ్‌పై అర్ష్‌దీప్ సింగ్ ఈ ఫీట్ సాధించారు.
Similar News
News December 6, 2025
ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి?.. ఎందుకోసం?

ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్ (A-GPS) వ్యవస్థ నిరంతరం యాక్టివేట్ చేసి ఉండాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫోన్ మేకర్లకు ఆదేశాలివ్వాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసుల దర్యాప్తులో ప్రభుత్వ ఏజెన్సీలు లొకేషన్ కోసం సెల్యులార్ టవర్ డేటాపై ఆధారపడుతున్నాయి. కానీ కచ్చితమైన లొకేషన్ గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో A-GPSను తప్పనిసరి చేయాలని టెలికాం సంస్థలు ప్రతిపాదించాయి.
News December 6, 2025
ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ తప్పనిసరి?.. భద్రతకు ముప్పు!

కేంద్రం పరిశీలిస్తున్న ఫోన్ల లొకేషన్ ట్రాకింగ్ అంశాన్ని యాపిల్, శామ్‌సంగ్, గూగుల్ వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది యూజర్ల ప్రైవసీకి విరుద్ధమని, ఫోన్లు నిఘా పరికరాలుగా మారుతాయని అంటున్నట్లు సమాచారం. ‘ట్రాకింగ్ తప్పనిసరి చేసే విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. యూజర్లలో సైన్యానికి చెందిన వారు, జడ్జిలు, జర్నలిస్టులు ఉంటారు. భద్రతా పరమైన సమస్యలు వస్తాయి’ అని చెబుతున్నట్లు Reuters తెలిపింది.
News December 6, 2025
పుతిన్ భారత పర్యటనపై చైనా మీడియా ఏమందంటే..?

భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనపై చైనా మీడియా స్పందించింది. 2 దేశాలు ఒంటరిగా లేవని ప్రపంచానికి పంపిన సందేశమని ‘గ్లోబల్ టైమ్స్’ చెప్పింది. ‘భారత్, రష్యా తమ సామర్థ్యాలను సొంతంగా, మరింతగా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. 2 దేశాల మధ్య సమన్వయం, సహకారమే ఇందుకు నిదర్శనం. US, వెస్ట్ ఆంక్షలు ఫలించవు’ అని ఫారిన్ అఫైర్స్ వర్సిటీ ప్రొఫెసర్ లీ హైడాంగ్ చెప్పారని తెలిపింది.


