News April 5, 2024
T20WCకి మయాంక్ యాదవ్‌ను తీసుకోవాలి: మనోజ్ తివారీ
IPLలో అదరగొడుతోన్న ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రానున్న T20WC కోసం షమీ, బుమ్రా తర్వాత మూడో పేసర్‌గా ఇతడిని తీసుకోవాలని మనోజ్ తివారీ BCCIకి సూచించారు. ‘నేను చీఫ్ సెలక్టర్‌గా ఉంటే మయాంక్‌ను ఎంపిక చేస్తా. అతని యాక్షన్, నియంత్రణతో కూడిన బౌలింగ్ అద్భుతంగా ఉంది. పెద్ద టోర్నీల్లో అవకాశం ఇస్తే మరింత మెరుగ్గా రాణిస్తాడు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 19, 2025
100 మందిలో ఒకరికి క్యాన్సర్!
AP: రాష్ట్రంలో 100 మందిలో ఒకరు క్యాన్సర్ అనుమానితులుగా ఉన్నట్లు ప్రభుత్వ స్క్రీనింగ్ పరీక్షల్లో తేలింది. ఇప్పటివరకు 53.07 లక్షల మందికి టెస్టులు చేయగా 52,221 మంది క్యాన్సర్ అనుమానితులు ఉన్నారని ఆరోగ్యశాఖ గుర్తించింది. నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అనుమానితులే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఈ స్క్రీనింగ్ పరీక్షలను ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది.
News January 19, 2025
వచ్చే నెల 12 నుంచి మినీ మేడారం
TG: మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే మరుసటి ఏడాది నిర్వహించే మండమెలిగె పండుగను మినీ మేడారంగా భక్తులు పిలుస్తారు. వచ్చే నెల 12 నుంచి 15 వరకు ఈ జాతర జరగనుంది. దీని కోసం రూ.32 కోట్లతో అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
News January 19, 2025
బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో తేలిగ్గా అర్థం చేసుకునే విధంగా ఈ ప్రతిపాదిత బిల్లు ఉండనుంది. ప్రస్తుత చట్టంలో 298 సెక్షన్లు, 23 చాప్టర్లు ఉన్నాయి. కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.