News March 3, 2025
మేనల్లుడిని పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి

BSP చీఫ్ మాయావతి కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పరిణతి లేదంటూ మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. కాన్షీరాం, అంబేడ్కర్‌ల సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ మూమెంట్, పార్టీ ప్రయోజనం కోసమే ఈ పని చేశానని తెలిపారు. నెల క్రితం బహిష్కరణకు గురైన అతడి మామ అశోక్ సిద్ధార్థ్ మాటలు ఇప్పటికీ వింటున్నాడని, పార్టీలో వర్గ విబేధాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. అలాంటి వారికి శిక్ష తప్పదన్నారు.
Similar News
News March 4, 2025
శుభ ముహూర్తం (04-03-2025)

☛ తిథి: శుక్ల పంచమి, రా.8.07 వరకు
☛ నక్షత్రం: అశ్విని, ఉ.9.00 వరకు
☛ శుభ సమయం: ఏమీ లేవు
☛ రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
☛ యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
☛ దుర్ముహూర్తం: ఉ.8.24-నుంచి 9.12 వరకు, రా.10.48 నుంచి 11.36 వరకు
☛ వర్జ్యం: ఉ.6.46 వరకు, సా.5.47 నుంచి 7.17 వరకు
☛ అమృత ఘడియలు: తె.4.45 గంటల నుంచి 6.14 వరకు
News March 4, 2025
భారత్ – ఆసీస్ మ్యాచ్‌కు కొత్త పిచ్

CT ఫస్ట్ సెమీఫైనల్‌లో రేపు భారత్, ఆసీస్ తలపడనున్నాయి. హైబ్రిడ్ విధానం వల్ల భారత్ తన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతోంది. ఇది టీమ్ఇండియాకు కలిసొస్తోందని పలువురు మాజీ క్రికెటర్లు అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్‌కు కొత్త పిచ్ వినియోగిస్తున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. AUSకు చెందిన క్యూరేటర్ మాథ్యూ శాండ్రీ ఆధ్వర్యంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్(ECB) పిచ్ సిద్ధం చేసింది.
News March 4, 2025
TODAY HEADLINES

* TG: MLCలుగా మల్క కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి విజయం
* TG: ఇంటర్ ఎగ్జామ్స్.. 5min లేటైనా అనుమతి
* AP ఎక్కువ నీరు తీసుకుంటోంది.. అడ్డుకోండి: రేవంత్
* త్వరలోనే 16,347 టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్
* ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు గెలుపు
* చిరంజీవి గారూ.. కూతుళ్లూ వారసులే: కిరణ్ బేడీ
* రోహిత్‌పై కాంగ్రెస్ నేత కామెంట్స్.. పొలిటికల్ హీట్
* సూచీలు ఫ్లాట్.. ఆదుకున్న మెటల్, రియల్టీ స్టాక్స్