News April 25, 2024
‘పది రోజుల్లో MBA’.. యూజీసీ వార్నింగ్

ఆన్లైన్లో నకిలీ డిగ్రీ కోర్సుల పట్ల యూజీసీ హెచ్చరికలు జారీ చేసింది. విద్యార్థుల్ని ఆకట్టుకునేందుకు ‘పది రోజుల్లో MBA’ వంటి కోర్సుల పేర్లతో ఆన్లైన్ ప్రోగ్రామ్లు, కోర్సులు అందిస్తామంటూ కొన్ని సంస్థలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర లేదా రాష్ట్ర, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైన సంస్థలకు మాత్రమే డిగ్రీ ప్రదానం చేసే అధికారం ఉందని స్పష్టం చేసింది.
Similar News
News January 21, 2026
కేంద్రప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటే ACB కేసు పెట్టొచ్చు: SC

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటే CBI ముందస్తు అనుమతి లేకుండానే రాష్ట్ర పోలీసులు కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అవినీతి నిరోధక చట్టంలోని Sec-17 ప్రకారం రాష్ట్ర ఏజెన్సీ, కేంద్ర ఏజెన్సీతో పాటు ఏ ఇతర పోలీసు ఏజెన్సీ అయినా కేసు పెట్టొచ్చంది. అవినీతికి పాల్పడ్డ కేంద్రప్రభుత్వ ఉద్యోగిపై రాజస్థాన్ ACB కేసుపెట్టడాన్ని అక్కడి హైకోర్టు సమర్థించగా సుప్రీంకోర్టు సైతం ఏకీభవించింది.
News January 21, 2026
నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలు శిక్ష

నిబంధనలను ఉల్లంఘించి పురుగు మందులను తయారు చేసినా, దిగుమతి చేసుకున్నా నేరం. వీటి విక్రయాల వల్ల ఎవరైనా మరణించినా లేదా గాయపడినా తయారీదారులను బాధ్యులను చేస్తూ ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. తొలిసారి నేరానికి రూ.10లక్షలు- రూ.50 లక్షలు, రెండోసారి అదే తప్పు చేస్తే, గతంలో విధించిన జరిమానా కంటే రెట్టింపు వసూలు చేస్తారు. రిపీటైతే లైసెన్స్ రద్దు, ఆస్తులను జప్తు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది.
News January 21, 2026
రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. అంతా ఉత్తిదే!

సోషల్ మీడియాలో RGF(రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ) తెగ వైరలవుతోంది. ఓ యూట్యూబర్ చేసిన తుంటరి పని దీనికి కారణమని సమాచారం. హీరో రాజశేఖర్ను ఓనర్గా పేర్కొంటూ ఓ వీడియో చేయగా ఫేక్ అపాయింట్మెంట్స్, ఐడీ కార్డ్స్, శాలరీలు అంటూ పోస్టులు పుట్టుకొచ్చాయి. ఇందులో ఏదీ నిజం కాదని, ఒకరిని చూసి మరొకరు ట్రెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. యూట్యూబ్లో వచ్చే ఇలాంటి వీడియోలను గుడ్డిగా నమ్మొద్దని పలువురు సూచిస్తున్నారు.


