News January 29, 2025
MBNR: ఐదు కిలోమీటర్ల వరకు మద్యపాన నిషేధం

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 16 వరకు జరగనున్న మన్యం కొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థాన పరిధి చుట్టూరా ఐదు కిలోమీటర్ల మేర మద్యపాన నిషేదం విధిస్తున్నట్టు స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యపాన నిషేధం విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు.
Similar News
News October 28, 2025
MBNR: గంజాయి విక్రయంపై దాడి.. నిందితులు వీరే

MBNR(D) మాచారం (NH–44 హైవే వద్ద) జడ్చర్ల టౌన్ PS పరిధిలో గంజాయి విక్రయంపై పోలీసులు దాడి నిర్వహించారు. నిందితులు 1.మరికంటి సుమంత్ రెడ్డి(MBNR),2.అబ్దుల్ రెహమాన్(MBNR),3.శుభోద్ కాంత్ శర్మ(బీహార్),4.సత్తు యాదవ్ కుమార్(బిహార్) గంజాయి కొనుగోలు,విక్రయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు నిర్ధారణ కావడం వల్ల దాడి చేసి అరెస్టు చేశారు. దీంతో RNCC యూనిట్, ఈగల్ టీం,SI ఖాదర్, పోలీస్ సిబ్బందిని SP ప్రశంసించారు.
News October 28, 2025
MBNR: సౌత్ జోన్.. PU కబడ్డీ జట్టు READY

సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు పాలమూరు వర్సిటీ స్త్రీల కబడ్డీ జట్టు చెన్నైలోని వినాయక మిషన్ ఫౌండేషన్ వర్సిటీకి బయలుదేరింది. వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొ.జిఎన్ శ్రీనివాస్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేశారు. యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ వై.శ్రీనివాసులు, కోచ్ వెంకటేష్, మేనేజర్ ఉష పాల్గొన్నారు.
News October 27, 2025
MBNR: గంజాయి విక్రయంపై దాడి.. నలుగురి అరెస్ట్

మహబూబ్నగర్ RNCC యూనిట్, ఈగల్ టీం, జడ్చర్ల పోలీసుల సంయుక్తంగా మాచారం గ్రామం (NH–44 హైవే వద్ద) జడ్చర్ల టౌన్ PS పరిధి గంజాయి విక్రయంపై ప్రత్యేక దాడి నిర్వహించింది. జడ్చర్ల టౌన్ CI కమలాకర్ వివరాల ప్రకారం.. గంజాయి విక్రయంపై దాడిలో నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేశామని, వారి నుంచి మొత్తం 241 గ్రాముల గంజాయి, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచామన్నారు.


