News April 9, 2026

MBNR: రహదారి భద్రతపై రాష్ట్రస్థాయి సమీక్ష

image

రాష్ట్ర CS కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. “అర్రైవ్ అలైవ్” కార్యక్రమం అమలు, దాని సిద్ధతపై ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఎస్పీ డి.జానకి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై చర్చించారు.

Similar News

News April 20, 2026

MBNR: మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

మహబూబ్‌నగర్ పిల్లలమర్రి సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ప్రిన్సిపల్ డాక్టర్ జయప్రద తెలిపారు. బీఎస్సీ, బీకాం, బిజెడ్సీ, బీఏ కోర్సుల్లో చేరాలనుకునే వారు ‘దోస్త్’ (DOST) వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మూడు సెట్ల జిరాక్స్ పత్రాలు, 8 ఫొటోలతో సంప్రదించాలని ఆమె పేర్కొన్నారు.

News April 20, 2026

మహబూబ్‌నగర్: ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో బాధితులు పోలీస్ స్టేషన్‌కు రాకుండానే ఇంటి నుంచే ఫిర్యాదు చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఎస్పీ జానకి తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, మైనర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ బృందాలకు ఆదేశాలు జారీ చేశామని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

News April 20, 2026

MBNR: అక్కడ.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతల రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్‌పేటలో 43.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. కోయిలకొండ మండలం సిరివెంకటాపూర్ 43.3, దేవరకద్ర 43.2, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.0, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 42.6, అడ్డాకుల 42.4, కోయిలకొండ మండలం పారుపల్లి 42.0, చిన్న చింతకుంట 41.8, జడ్చర్ల 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.