News November 4, 2024
నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు: అచ్చెన్నాయుడు

AP: నిత్యావసరాల వస్తువుల ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలపై భారం పెరగకుండా చూస్తామని తెలిపారు. ఈమేరకు నిత్యావసరాల ధరల పర్యవేక్షణపై సచివాలయంలో సమీక్షించారు. రైతు బజార్లలో ధరల పట్టికల ప్రదర్శన, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. సమీక్షలో పలువురు మంత్రులు, వ్యవసాయ, ఆర్థిక, పౌరసరఫరాల, మార్కెటింగ్‌శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 28, 2025
పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే..

ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలతో పాటు పెద్దల్లో కూడా అటెన్షన్ స్పాన్ తగ్గిపోతుంది. ఇలా కాకుండా పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే పిల్లలు చదువుకొనేటపుడు పేరెంట్స్ ఫోన్ పట్టుకొని కూర్చోకుండా వారితో కూర్చొని వార్తలు, పుస్తకాలు చదవాలి. దీంతో పిల్లలకు అది అలవాటవుతుంది. ఎప్పటికప్పుడు అటెన్షన్ బ్రేక్‌లు ఇవ్వాలి. టైం టేబుల్ తయారు చేయాలి. మెమరీ గేమ్‌లు ఆడించాలి. వారి దృష్టి మరల్చే వస్తువులు దూరంగా ఉంచాలి.
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి) ఎలా గుర్తించాలి?

ఇది ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News November 28, 2025
గొర్రెల్లో బొబ్బ రోగం.. ఎలాంటి చికిత్స అందించాలి?

☛ వ్యాధి సోకిన గొర్రెలను వెంటనే మంద నుంచి వేరు చేయాలి.
☛ ఆ గొర్రెలకు గంజి వంటి సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. పచ్చి పశుగ్రాసాన్ని ఎక్కువగా ఇవ్వరాదు.
☛ బొబ్బల మీద వేపనూనె లేదా హిమాక్స్ వంటి పూత మందులను రాయాలి.
☛ వెటర్నరీ డాక్టర్ సలహాతో బాక్టీరియాను నియంత్రించడానికి యాంటీ బయాటిక్స్, డీహైడ్రేషన్ తగ్గించడానికి IV fluids లేదా ORS తరహా ద్రావణాలు ఇవ్వడం, టీకాలు అందించడం మంచిది.


