News November 4, 2024

నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు: అచ్చెన్నాయుడు

image

AP: నిత్యావసరాల వస్తువుల ధరల పెరుగుదల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలపై భారం పెరగకుండా చూస్తామని తెలిపారు. ఈమేరకు నిత్యావసరాల ధరల పర్యవేక్షణపై సచివాలయంలో సమీక్షించారు. రైతు బజార్లలో ధరల పట్టికల ప్రదర్శన, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. సమీక్షలో పలువురు మంత్రులు, వ్యవసాయ, ఆర్థిక, పౌరసరఫరాల, మార్కెటింగ్‌శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 5, 2024

పెళ్లి తర్వాత శోభిత తొలి పోస్ట్

image

అక్కినేని హీరో నాగచైతన్యతో వివాహం తర్వాత హీరోయిన్ శోభిత తొలి పోస్ట్ చేశారు. చైతూతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘పెళ్లి ఫొటో’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా నిన్న వీరిద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

News December 5, 2024

ఆన్‌లైన్‌లో మెడిసిన్స్ స‌ర‌ఫ‌రాపై ఆందోళ‌న‌లు

image

మెడిసిన్స్‌ను 10 Minలో వినియోగ‌దారుల‌కు డెలివ‌రీ చేస్తున్న సంస్థ‌ల తీరుపై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మందుల స‌ర‌ఫ‌రాలో ఉన్న నిర్దిష్ట ప్రోటోకాల్‌కు ఇది విరుద్ధ‌మ‌ని చెబుతున్నారు. ప్రిస్క్రిప్ష‌న్ వెరిఫికేష‌న్, పేషెంట్ ఐడెంటిఫికేష‌న్‌ లేకుండానే మెడిసిన్స్ డెలివ‌రీ హానిక‌ర‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. కాలంచెల్లిన, న‌కిలీ మందుల స‌ర‌ఫ‌రాకు ఆస్కారం ఉండడంతో దీన్ని అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు.

News December 5, 2024

మీకు నేషనల్ అవార్డు ఇవ్వాలి.. రష్మిక రియాక్షన్ ఇదే

image

‘పుష్ప-2’లో హీరోయిన్ రష్మిక అదరగొట్టారని సినిమా చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జాతర సీన్‌ తర్వాత ఆమె నటనకు జాతీయ అవార్డు ఇవ్వాలని ఓ అభిమాని ట్వీట్ చేశారు. దీనికి ‘నిజమా? యాయ్!’ అంటూ నేషనల్ క్రష్ రిప్లై ఇచ్చారు. కాగా ఈ మూవీలో రష్మిక డాన్స్ కూడా ఇరగదీశారని పలువురు పోస్టులు చేస్తున్నారు.