News November 23, 2024
‘మెకానిక్ రాకీ’ వచ్చేది ఈ ఓటీటీలోనే!

విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘మెకానిక్ రాకీ’ సినిమా నిన్న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ ముళ్లపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. థియేటర్ రన్ పూర్తయ్యాక ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు.
Similar News
News November 12, 2025
కురుపాం గురుకులంలో జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ విచారణ

కురుపాం గురుకుల పాఠశాలలో విద్యార్థుల మృతిపై బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ హ్యూమన్ రైట్స్ కమిటీ సమగ్రంగా విచారణ జరిపింది. కమిటీ సభ్యులు ఉదయం పాఠశాలకు చేరుకుని, అక్కడి వసతి గృహాలు, భోజనశాల, తరగతి గదులు, ఆరోగ్య సదుపాయాలు తదితర విభాగాలను అణువణువు పరిశీలించారు. మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులు కలిసి సమాచారం సేకరించారు.
News November 12, 2025
భారత్‌కు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: ఇజ్రాయెల్ పీఎం

ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఖండించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. భారత్‌కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ‘భారత్, ఇజ్రాయెల్ శాశ్వత సత్యాలపై ఆధారపడిన పురాతన నాగరికతలు. మన నగరాలపై దాడులు జరగొచ్చు. కానీ అవి మనల్ని భయపెట్టలేవు. ఇరు దేశాల వెలుగు శత్రువుల చీకట్లను తరిమేస్తుంది’ అని ట్వీట్ చేశారు.
News November 12, 2025
బిహార్‌లో NDAకు 121-141 సీట్లు: Axis My India

బిహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని Axis My India ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. NDAకు 121-141, MGBకు 98-118 సీట్లు వస్తాయని పేర్కొంది. ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీ 0-2 సీట్లకు పరిమితం అవుతుందని తెలిపింది. NDAకు 43%, MGBకి 41% ఓట్ షేర్ వస్తుందని వివరించింది. అటు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ NDA కూటమే గెలుస్తుందని అంచనా వేశాయి.


