News December 2, 2024

మీడియానే ఇదంతా చేస్తోంది: RGV

image

తాను పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నట్లు వస్తోన్న వార్తలను ఖండిస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘మీడియా శత్రువులకు నమస్కారము. పోలీస్ ఆఫీసర్ ఎవ్వరైనా నా దగ్గరకు వచ్చారా? రాలేదు. కనీసం మాట్లాడారా? లేదు. మీడియా సంస్థలే ఇదంతా చేస్తున్నాయి. RGV గోడ దూకి వెళ్లిపోయారని, ఆరు టీమ్స్ జల్లెడ పడుతున్నాయని మీడియానే రాసింది. పోలీసులు అరెస్ట్ చేయాలంటే లోపలికి వస్తారు’ అని ఫైరయ్యారు.

Similar News

News January 16, 2026

శ్రీకాకుళం జిల్లాలో నేడు భోగి జరుపుకొనే ప్రాంతమిదే!

image

శ్రీకాకుళం జిల్లాలోని ఆ ప్రాంతవాసులు భోగి పండుగనే జరుపుకోరు. నేడు (కనుమ) రోజున ఈ వేడుకను నిర్వహించి.. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మెళియాపుట్టిలోని కొసమాల గ్రామంలో దేవాంగుల వీధిలోని చేనేతలే ఇలా భోగిని భిన్నంగా చేస్తారు. వృత్తి రీత్యా పనుల్లో తీరిక లేకపోవడమే ప్రధాన కారణం. ఆనాటి పూర్వీకుల ఆచారాన్నే ఇప్పటికీ ఆ వృత్తుల వారు కొనసాగిస్తున్నారు.

News January 16, 2026

వరుసగా అబార్షన్లు అవుతున్నాయా?

image

గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అవుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రెండోసారి అబార్షన్ జరిగితే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని టెస్టులు చేయించి మందులు వాడాలి. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని టెస్టుకి పంపి జన్యు సమస్యలున్నాయో తెలుసుకోవచ్చు. మేనరికం అయితే దంపతులకి టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రక్తపరీక్షలు, స్కానింగ్ వంటివి చేసి వాటికి తగ్గ ట్రీట్‌మెంట్ చేయాలి.

News January 16, 2026

‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’

image

‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’అనేది సామెత. ఇవాళ ఎలాంటి ప్రయాణాలు చేయకూడదంటారు పెద్దలు. దీనికి కారణం పూర్వం ఎడ్ల బండ్ల మీదే ప్రయాణాలు జరిగేవి. కనుమ రోజు పశువులను పూజించి ఏడాదిలో ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా బండ్లు కట్టొద్దని నిర్ణయించారు. అందుకే ఈ రోజున ప్రయాణాలు వద్దంటారు. అంతే కాకుండా భోగి, సంక్రాంతి హడావుడిగా అయిపోతాయి. అందరూ కలిసి సరదాగా గడపడం కోసం కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం వద్దంటారు.