News December 2, 2024

మీడియానే ఇదంతా చేస్తోంది: RGV

image

తాను పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నట్లు వస్తోన్న వార్తలను ఖండిస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘మీడియా శత్రువులకు నమస్కారము. పోలీస్ ఆఫీసర్ ఎవ్వరైనా నా దగ్గరకు వచ్చారా? రాలేదు. కనీసం మాట్లాడారా? లేదు. మీడియా సంస్థలే ఇదంతా చేస్తున్నాయి. RGV గోడ దూకి వెళ్లిపోయారని, ఆరు టీమ్స్ జల్లెడ పడుతున్నాయని మీడియానే రాసింది. పోలీసులు అరెస్ట్ చేయాలంటే లోపలికి వస్తారు’ అని ఫైరయ్యారు.

Similar News

News January 18, 2026

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న నలుగురు, ఇవాళ ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

News January 18, 2026

గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

image

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ హార్మోన్లు కలిసి ఉన్న మాత్రలు వినియోగించే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్త ప్రవాహం జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టడం వల్ల క్రిప్టోజెనిక్ స్ట్రోక్‌ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రో‌క్‌లేనని తెలిపారు.

News January 18, 2026

ఇతిహాసాలు క్విజ్ – 127 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు ఉండి కూడా, పాండవుల విజయాన్ని కోరుకున్నది ఎవరు?
సమాధానం: కురుక్షేత్రంలో కౌరవుల సైన్యాధిపతిగా ఉన్న భీష్ముడు పాండవుల విజయాన్ని కోరుకున్నారు. ధర్మం పాండవుల వైపే ఉందని ఆయనకు తెలుసు. అందుకే, తనను ఎలా ఓడించాలో స్వయంగా పాండవులకే రహస్యాన్ని చెప్పి, వారు విజయం సాధించేలా సహకరించారు. ఆయనతో పాటు విదురుడు కూడా పాండవ పక్షపాతిగా ఉండేవారు.
<<-se>>#Ithihasaluquiz<<>>