News December 5, 2024
లైంగిక దాడిలో మెడికల్ ఎవిడెన్స్ ప్రధాన సాక్ష్యం కాబోదు: హైకోర్టు

లైంగిక దాడుల కేసుల్లో మెడికల్ ఎవిడెన్స్ బలమైన సాక్ష్యం కాబోదని బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్ తెలిపింది. నేరాభియోగాల నిరూపణలో మద్దతుపరిచే సాక్ష్యంగానే అది పనికొస్తుందని పేర్కొంది. 10 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించాడన్న కేసులో ట్రయల్ కోర్టు ఒకరికి విధించిన 20ఏళ్ల జైలుశిక్షను నిలిపివేసింది. అతడిపై బాధితురాలు, ఆమె తల్లి ఎలాంటి పెనట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ ఆరోపణలు చేయలేదని వెల్లడించింది.
Similar News
News January 18, 2026
ప్చ్.. రో‘హిట్’ అవ్వలేదు

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపర్చారు. మూడో వన్డేలో 11 పరుగులే చేసి ఫౌల్క్స్ బౌలింగ్‌లో వెనుదిరిగారు. సిరీస్ మొత్తంగా 61 పరుగులే చేశారు. మరో ఆరు నెలల వరకు వన్డే మ్యాచ్‌లు లేవు. హిట్ మ్యాన్ నుంచి ఆశించిన స్థాయిలో ప్రదర్శన లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. మళ్లీ IPL-2026లోనే రోహిత్ ఆటను చూడవచ్చు. ప్రస్తుతం వన్డేల్లో రోహిత్ 3వ ర్యాంకులో కొనసాగుతున్నారు.
News January 18, 2026
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నేషనల్ పార్కు ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిన్న నలుగురు, ఇవాళ ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనాస్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
News January 18, 2026
గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టోజెన్ హార్మోన్లు కలిసి ఉన్న మాత్రలు వినియోగించే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్త ప్రవాహం జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టడం వల్ల క్రిప్టోజెనిక్ స్ట్రోక్ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రోక్‌లేనని తెలిపారు.


