News September 13, 2024

హరీశ్ రావుకు వైద్య పరీక్షలు

image

TG: భుజం గాయంతో బాధపడుతున్న మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో పాటు పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. నిన్న అరెస్ట్, ఆందోళనల సమయంలో ఆయన భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. ఆస్పత్రికి వెళ్లేందుకు మాత్రమే పోలీసులు తాజాగా ఆయనకు అనుమతినిచ్చారు.

Similar News

News December 4, 2025

ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

image

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<>ICSIL<<>>)6 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 9 వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 10న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు జీతం రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in

News December 4, 2025

పెప్లమ్ బ్లౌజ్‌ని ఇలా స్టైల్ చేసేయండి

image

సాధారణంగా పెప్లమ్ టాప్స్ జీన్స్‌పైకి సూట్ అవుతాయి. కానీ దీన్ని ఎత్నిక్ వేర్‌గా ట్రై చేస్తే మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెప్లమ్ టాప్స్‌ను చీరలతో స్టైల్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు. పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్‌తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికి తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

News December 4, 2025

‘అఖండ-2’ రిలీజ్ ఆపాలి: మద్రాస్ హైకోర్టు

image

‘అఖండ-2’ విడుదలను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ‘అఖండ-2’ నిర్మాణ సంస్థ 14 రీల్స్(ఇప్పుడు 14 రీల్స్ ప్లస్) తమకు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ‘అఖండ2’ విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.