News August 17, 2024
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ రాసిన మందుల చీటీ
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అవుతోంది. తాజాగా ఆమె రాసిన ప్రిస్క్రిప్షన్ బయటకు వచ్చింది. ఊపిరితిత్తుల విభాగానికి చెందిన ఆమె చక్కటి చేతిరాతతో రోగికి మందులు రాశారు. చాలా మంది డాక్టర్లు రాస్తే అర్థం కాదని, ఇంత క్లియర్‌గా ఉన్న చీటీని చూడటం ఇదే తొలిసారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దేశం మంచి వైద్యురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 12, 2024
రేవంత్.. మీ పాలన నుంచి తెలంగాణను కాపాడుకుంటాం: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్‌లో మండిపడ్డారు. ‘మీరు గూండాయిజం, దౌర్జన్యం చేసినా.. మీ కాంగ్రెస్ గూండాల బెదిరింపులకు బీఆర్ఎస్ సైన్యం భయపడదు. మీ అవినీతి పాలన నుంచి తెలంగాణలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకుంటాం. మీరు చేసే ప్రతి బెదిరింపు మా నిర్ణయాన్ని మరింత బలంగా మారుస్తుంది. కౌశిక్ రెడ్డి బలంగా నిలబడండి. ప్రజలు, మేము మీ వెంటే ఉన్నాం’ అని పేర్కొన్నారు.
News September 12, 2024
వర్షాకాలంలో ఆరోగ్యానికి ఏ కూరగాయలు మంచివంటే..
సీజనల్‌గా లభించేవాటిని తింటే ఆరోగ్యం బాగుంటుందంటారు పెద్దలు. మరి వర్షాకాలంలో ఏ కూరగాయలు మంచివి? న్యూట్రీషనిస్ట్ లవ్నీత్ బాత్రా 3 కూరగాయల పేర్లు చెబుతున్నారు. అవి సొరకాయ, కాకరకాయ, మునగ. ఈ మూడింటిలోనూ పుష్కలంగా విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కండరాల మరమ్మతులు, రోగ నిరోధక వ్యవస్థ మెరుగుదల, చర్మ సౌందర్యం, ఎముకల ఆరోగ్యం విషయాల్లో ఈ మూడూ ఉత్తమమని తెలిపారు.
News September 12, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలో వర్షాలు దాదాపు తగ్గుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.